జగిత్యాల, అక్టోబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డబుల్ బెడ్ రూం ఇండ్ల ఎంపికపై అక్రమాలు చేసిన నిందితులు భోగ రాకేష్, చంద్ర శేఖర్ లను పోలీసులు అరెస్టు చేసినట్టు డిఎస్‌పి వెంకటస్వామి తెలిపారు.ఈ మేరకు సోమవారం వివరాలు వెల్లడిరచారు.
భోగ రాకేష్ డీఈవో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడని, చంద్ర శేఖర్ మీసేవ ఆపరేటర్‌గా ఉన్నాడన్నారు. ఒక్కొక్క లబ్దిదారుని వద్దనుండి రూ. 5 వేల నుండి 60 వేల వరకు వసూల్ చేసినట్టు గుర్తించామన్నారు. దాదాపు 57 మంది లబ్దిదారులను ఎంక్వైరీలో పోలీసులు గుర్తించినట్టు తెలిపారు.
ఇప్పటి వరకు రూ. 4 లక్షలు అక్రమాలు జరిగినట్లు గుర్తించగా, కొందరు ఫోన్ పే, నగదు ద్వారా చెల్లింపులు చేశారన్నారు.