నిజామాబాద్, అక్టోబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో జరిగిన బీసీ కులాల విస్తృత స్థాయి సమావేశంలో సావెల్ గ్రామానికి చెందిన నెల్ల లింగన్నను బాల్కొండ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. రాజకీయ కుటుంబం నుండి వచ్చిన లింగన్న గారు గతంలో గ్రామాభివృద్ది కమిటీ అధ్యక్షులుగా పని చేసిన అనుభవం ఉన్న నాయకులని జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని బీసీలందరిని ఏకతాటి పైకి తెచ్చి రాజ్యాధికారం సాధించాలని ఆకాంక్షించారు.
తన సర్పంచ్గ ఉన్న గ్రామంలో అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడంలో లింగన్న కృషి ఎనలేనిదని బుస్స ఆంజనేయులు అన్నారు. తనకు ఇచ్చిన ఈ బాధ్యతను శక్తివంచన లేకుండ నిర్వర్తిస్తానని నూతనంగా నియామకమైన బాల్కొండ అధ్యక్షులు నెల్ల లింగన్న అన్నారు. కార్యక్రమంలో ఆకుల ప్రసాద్, కరిపే రవిందర్, నారాయణరెడ్డి, శ్రీలత, ద్యాగ శేఖర్, కోడూరి స్వామి, విజయ్, సంజీవ్, బక్కన, శేఖర్, పెద్దన్న, రవి, రంగు ప్రసాద్, యదేశ్వర్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.