కామారెడ్డి, అక్టోబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్రాస్ స్టేట్ సైకిల్ ర్యాలీకి సోమవారం రాత్రి కామారెడ్డి పట్టణంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్వాగతం పలికారు. ఓటర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా సైకిల్ ర్యాలీ కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్దకు వచ్చింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని సూచించారు.
కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ఎన్సిసి విద్యార్థులు, సైకిల్ ర్యాలీ టీం లీడర్ రాజేష్, జిల్లా ఎన్నికల నోడల్ అధికారి శ్రీధర్ రెడ్డి, డిగ్రీ కళాశాల ఎన్సిసి అధికారి రామస్వామి, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, మహిళా సంఘాల ప్రతినిధులు, రిసోర్స్ పర్సన్లు, యువకులు పాల్గొన్నారు.