కామారెడ్డి, అక్టోబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో ఈనెల 9వ తేదీ సోమవారం గంజ్‌లో ఒక ఇంట్లో ముసలి ఆమె ఒక్కతే ఉంటున్నది. గమనించిన నేరస్తుడు ఆమె మెడలో నుండి 6 తులాల బంగారపు రెండు వరుసల పుస్తెల తాడు గుంజుకొని పారిపొయాడని కామారెడ్డి పోలీసులు తెలిపారు.
కేసు దర్యాప్తులో బాగంగా కామారెడ్డి పట్టణ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేశ్ పర్యవేక్షణలో అనిల్ ఎస్‌ఐపి, సయ్యద్ హెచ్‌సి, విశ్వనాధ్ పిసి, రాజు పిసి కలిసి నేరస్తుడిని పట్టుకోవడానికి బృందంగా ఏర్పడి నేరస్తుడి కోసం వెతుకుతుండగా బుధవారం 11వతేదీ కామారెడ్డి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏరియాలో గల బంగారు షాప్‌ల వద్ద తిరుగుతూ ఉండగా అక్కడ ఉన్న పోలీసు వారిని నిందితుడు చూసి పారిపోయే ప్రయత్నం చేశాడన్నారు.
కాగా పోలీస్ వారు వెంబడిరచి పట్టుకొని విచారించగా నేరస్తుడు చేసిన నేరం స్వతాహాగా ఒప్పుకున్నాడని, దొంగలించిన బంగారాన్ని పోలీస్ వారు పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఇట్టి కేసును 24 గంటల్లో చేదించిన వారిని జిల్లా ఎస్‌పి శ్రీనివాస్ రెడ్డి అభినందించారు.
ఎవరికైనా ఆపద సమయంలో కానీ అనుమానితులు కనిపించిన సమయంలో కానీ లేదా నేరం జరిగిన వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారాన్ని తెలియజేయాలన్నారు. ఇలా వెంటనే సమాచారాన్ని పోలీస్ వారికి ఇవ్వడం ద్వారా నేరస్థులను వెంటనే పట్టుకునే అవకాశం కలిగిందన్నారు. అదేవిధంగా దొంగిలించబడిన సొత్తును కూడా బాధితులకు వెంటనే అందే అవకాశం ఉంటుందన్నారు.