ఆర్మూర్, అక్టోబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ డివిజన్ తపాల శాఖ పరిధిలోని 8 సబ్ పోస్టాఫీస్‌ల సహాయ పర్యవేక్షకురాలు యాపరు సురేఖ నిజామాబాద్‌కు బదిలీ అయిన సందర్భంగా బదిలీ వీడ్కోలు కార్యక్రమం ఎమ్మార్ గార్డెన్‌లో జరిగింది. నూతన సహాయ పర్యవేక్షకుడు భూమన్న అధ్యక్షతవహించగా ముఖ్య అతిథి సన్మాన గ్రహీత యాపరు సురేఖ యశ్వంత్ దంపతులను పూలు చల్లుతూ వేదికపైకి ఆహ్వానించారు.
ఐపీపీబి సీనియర్ మేనేజర్ మధు మోహన్, లక్ష్మణ్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ముందుగా యాపరు సురేఖ పేరుతో అభినందన నామాక్షరమాల చిత్ర పటాన్ని, కరపత్రాలను ఆవిష్కరించారు. 8 సబ్ పోస్టాఫీస్‌ల పరిధిలోని బీపీఎం ఏబీపిఎంలు సన్మాన గ్రహీతను శాలువలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. తర్వాత యాపరు సురేఖ చేసిన సేవలు ఆర్మూర్ ప్రాంతంలో చిరస్మరణీయమని, వారితో ఉన్న అనుబంధాలను, జ్ఞాపకాలను గుర్తుచేసుకొని వారి సేవలను అభినందించారు.
మెయిల్ వోవారిస్ చంద్ర శేఖర్, దశరథ్‌లను కార్యక్రమ సమన్వయ కర్త జింధం నరహరిలను శాలువ, పూలమాలలతో సత్కరించారు. సన్మాన గ్రహీత మాట్లాడుతూ తపాల శాఖ ఒక కుటుంబమని, నాకు సహకరించి రాష్ట్ర స్థాయి గుర్తింపుతెచ్చిన ఎస్పీఎంలకు, బీపీఎంలు, ఏబీపీఎంలందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో ఎస్పీఎంలు ఆంజనేయులు, ఉదయ్, ప్రదీప్, రాములు, మెయిల్ వోవారీస్‌లు చంద్రశేఖర్, దశరథ్, జీడీఎస్ రాష్ట్ర నాయకులు లింబాగౌడ్, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, 8 ఎస్‌వోల బీపీఎంలు వెంకటేష్, రాం మనోహర్, సత్యనారాయణ, వంశీ, మురళీ మనోహరా చారి, అభిరామ్ జగధీశ్, వేణు, రాజేష్, భూషన్ తదితరులు పాల్గొన్నారు.