సాలురా చెక్‌ పోస్టును తనిఖీ చేసిన కలెక్టర్‌, సీ.పీ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దున నిజామాబాద్‌ జిల్లా సాలురా వద్ద కొనసాగుతున్న ఉమ్మడి తనిఖీ కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పోలీస్‌ కమిషనర్‌ వి సత్యనారాయణ బుధవారం తనిఖీ చేశారు. చెక్‌ పోస్ట్‌ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న తీరును గమనించారు. విధుల్లో ఉన్న వివిధ శాఖల అధికారులు, సిబ్బంది గురించి ఆరా తీశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా నాలుగు చోట్ల అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. సాలూర, కందకుర్తి, ఖండ్‌ గాం, పోతంగల్‌ వద్ద ఉమ్మడి చెక్పోస్టులు, మరో ఆరు ప్రాంతాల్లో అంతర్‌ జిల్లా చెక్‌ పోస్ట్‌ లు నెలకొల్పడం జరిగిందన్నారు. ఎన్నికలు ముగిసేంతవరకు పై చెక్‌ పోస్టులలో నిరంతరం 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తారని అన్నారు.

పోలీస్‌, రెవెన్యూ, ఫారెస్ట్‌, రవాణా, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ తదితర శాఖలు ఉమ్మడిగా తనిఖీలు జరుపుతాయన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారని, అక్రమ మద్యం, నగదు వంటి వాటిని గుర్తించి సీజ్‌ చేస్తారని చెప్పారు. అయితే తనిఖీల వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు ప్రజలు ఎవరైనా నగదును వెంటబెట్టుకొని ప్రయాణాలు చేయాల్సి వస్తే సరైన ఆధారాలు కలిగి ఉండాలని కలెక్టర్‌ సూచించారు.

ఆధారాలు లేనట్లయితే నగదు జప్తు చేస్తారని అన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల్లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలతో గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళి తూచా తప్పకుండా అమలయ్యేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని అన్నారు.

విజయ్‌ మేరీ పాఠశాల పరిశీలన

సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా బోధన్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్‌ సామాగ్రి సేకరణ, పంపిణీ కోసం ఎంపిక చేసిన బోధన్‌ లోని విజయ్‌ మేరీ పాఠశాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, సీ.పీ సత్యనారాయణ బుధవారం పరిశీలించారు. పాఠశాలలోని గదులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, రిసీవింగ్‌, డిస్ట్రిబ్యూషన్‌, స్ట్రాంగ్‌ రూమ్‌ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.

ఎలాంటి పొరపాట్లకు, తప్పిదాలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఇదివరకు 2018లో జరిగిన ఎన్నికలకు సంబంధించి కూడా ఇదే కేంద్రాన్ని వినియోగించడం జరిగిందని కలెక్టర్‌ తెలిపారు. కలెక్టర్‌ వెంట బోధన్‌ ఆర్డీఓ రాజాగౌడ్‌, ఏ.సీ.పీ కిరణ్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »