అభ్యర్థి చేసిన ప్రతి ఖర్చు లెక్కలో చూపాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభ్యర్థి ఖర్చుపై ఎన్నికల నియమావళి సెక్షన్‌ డి లో స్పష్టంగా పేర్కొనడం జరిగిందని, ఆ మేరకు రోజు వారి ఖర్చు వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి తో కలిసి మాట్లాడుతూ అభ్యర్థి చేసిన ప్రతి ఖర్చును లెక్కలో చూపాలన్నారు.

వివిధ సెక్షన్‌ ల క్రింద ఏమేమి ఖర్చు చేస్తే ఎలా లెక్కిస్తారో కలెక్టర్‌ వారికి వివరించారు. సభలు, ర్యాలీలు, సమావేశాలకు ముందస్తుగా పోలీసుల అనుమతి పొందాలని, ఫస్ట్‌ ఇన్‌ ఫస్ట్‌ అవుట్‌ పద్ధతిన అనుమతి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రకటనలు, కరపత్రాలు, పోస్టర్ల ముద్రణకు సంబంధించి అనుమతి పొందాలని, ముద్రాణా సంస్థలు ఎన్ని ప్రతుల్లో ముద్రించారో, ప్రింటర్‌ పేరు, మొబైల్‌ నెంబర్‌ పొందుపరచాలన్నారు.

వాహనాల వినియోగంపై అనుమతి పొందాలన్నారు. అభ్యర్థి నామినేషన్‌ సందర్భంగా దాఖలు చేసి ఫార్మ్‌-26 అఫిడవిట్‌ లో కొద్దిగా మార్పు ఉందని, తప్పని సరిగా అన్ని అంశాలు పూరించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వ్యయ నియంత్రణకు సంబందించిన బుక్‌ లెట్‌ తో పాటు షామియానా, కుర్చీలు, బల్లలు, మైకు, బ్యానర్లు, ఫ్లెక్సీలు,భోజనం, హోటల్‌ రూమ్స్‌, వాహనాల అద్దె తదితర వాటికి సంభందించి నిర్థారించిన రేట్‌ కార్డు ప్రతులను అందజేస్తూ అట్టి ధరలపై అభిప్రాయాలను రేపటిలోగా తెలుపవలసినదిగా కోరారు.

అదేవిధంగా ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా, రేడియో లలో ప్రకటనలకు సంబంధించి సమాచార శాఖ నిర్దారించిన రేట్‌ కార్డులను వారికి అందజేశారు. వ్యవ నియంత్రణకు కట్టుదిట్టంగా అమలుపరస్చుటకు ఎన్నికల యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకున్నదని అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలను తనిఖీ చేస్తామని, క్షేత్ర బీస్థాయిలో ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు పట్టుకుంటారని అన్నారు. ఖర్చులకు సంబంధించి మూడు సార్లు క్రాస్‌ చెక్‌ చేస్తారని అన్నారు. ఎస్‌.ఓ.పి ఐ.టి. శాఖ వారు పట్టుకున్నా డబ్బులకు సరైన ఆధారాలు చూపిస్తే తిరిగి అప్పగిస్తామన్నారు.

సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు జూకంటి ప్రభాకర్‌, మదన్‌ లాల్‌ జాదవ్‌, కాసిం అలీ, అమర్‌ సింగ్‌, జఫ్ఫార్‌ ఖాన్‌ అనిల్‌ కుమార్‌, నరేందర్‌, ఎలక్షన్‌ సూపరింటెండెంట్‌ అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »