కామారెడ్డి, అక్టోబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా బుధవారం గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కామారెడ్డి లో న్యాయ చైతన్య సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బాలిక విద్యార్థినుల చేత బాల్య వివాహాలని అరికడతాము అని ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమానికి విచ్చేసిన వారు చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ ఆర్.బి రమేష్ చంద్ డిప్యూటీ లీగల్‌ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కే.మోహన్ రావు, అసిస్టెంట్ లీగల్‌ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పల్లె చిరంజీవి మాట్లాడుతూ బాలికల హక్కుల గురించి, భద్రత గురించి సూచనలు అందించారు. కార్యక్రమంలో జిల్లాన్యాయ సేవ అధికార సంస్ధ సిబ్బంది పాల్గొన్నారు