బీర్కూర్, అక్టోబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ,..
పది సంవత్సరాల పాలనలో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో మన బాన్సువాడ అభివృద్ధి ప్రధాత శానసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గాన్ని అన్నీ విధాలుగా అభివృద్ధి చేసారని, రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందాయని, అభివృద్ధి పదంలో మన బాన్సువాడ నియోజకవర్గం మరింత ముందుకు సాగాలంటే బాన్సువాడ నియోజక వర్గ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి ని కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా బీఆర్ఎస్ నాయకులు ఓటర్లను విజ్ఞప్తి చేసారు.
రానున్న రోజుల్లో మరెందరో వచ్చి ఓట్లకోసం కల్లబొల్లి మాటలు చెబితే ప్రజలెవరు నమ్మవద్దని ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు వివరించారు. ఓటును అభ్యర్థించిన వారిలో పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ అహ్మద్, పోగు నారాయణ, వారి వెంట నాగరాజు, హన్మాండ్లు తదితరులు ఉన్నారు.