కామారెడ్డి, అక్టోబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్య వివాహాలను అరికట్టవలసిన భాద్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని ప్రిన్సిపాల్ జిల్లా సెషన్స్ జడ్జి ఎస్.యెన్. శ్రీదేవి అన్నారు. ప్రపంచ బాలిక దినోత్సవం సందర్భంగా బుధవారం సాధన స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రాంగణంలో పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం ఎంతో పురోగమిస్తున్న ఇంకా అక్కడక్కడా బాలికలపై వేధింపులు, అక్రమ రవాణా జరగడం బాధాకరమని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో అవగాహన లేమి, పేదరికం వల్ల చదువుకునే వయస్సులో పనులకు పంపడం, 18 ఏళ్ళు నిండకుండానే బాల్య వివాహాలు చేయడం వంటి సంఘటనలు చూస్తున్నామని, వీటిని సమూలంగా అరికట్టడం అందరి బాధ్యతని అన్నారు.
వీటి నియంత్రణకు పోలీసు, మహిళా ,శిశు సంక్షేమం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, బాల్య వివాహాలు లేని భారత దేశంగా తీర్చిదిద్దుటకు తమ వంతు కార్య్రక్రమాలు నిర్వహిస్తూ కృషిచేస్తున్నాయని, వారికి మనవంతు పూర్తి సహకారమందించాలని అన్నారు.
కార్యక్రమంలో అడిషనల్ జిల్లా జడ్జి లాల్ సింగ్ నాయక్, జిల్లా న్యా సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి బి.శ్రీదేవి, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి భార్గవి, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఇంచార్జి మల్లేష్ గౌడ్, సాధన స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రాం కో-ఆర్డినేట్క్ర్ కొప్పుల రవి, అడ్వకెట్లు రమేష్ చంద్ , మోహన్, చిరంజీవి పాల్గొన్నారు.