కామారెడ్డి, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయవలసిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఎన్నికల విభాగం కంట్రోల్ రూమ్‌లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా చూడాలని, ఇందుకోసం కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమాజానికి పెనుప్రమాదంగా మారిన మాదకద్రవ్యాలపై …
Read More »Daily Archives: October 13, 2023
ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి రద్దు
నిజామాబాద్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన …
Read More »కామారెడ్డి జిల్లా ఎస్పీగా సింధు శర్మ బాధ్యతలు
కామారెడ్డి, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 13వ తేదీ శుక్రవారం సింధు శర్మ, ఐపీఎస్ కామారెడ్డి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. 2014 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన ఎస్పీ 2018 నుండి 2023 జనవరి వరకు జగిత్యాల జిల్లా ఎస్పీగా పని చేశారు. ప్రస్తుతం మామునూర్ 4 వ బెటాలియన్ కమాండెంట్‌గా పనిచేస్తూ బదిలీపై కామారెడ్డికి వచ్చారు.
Read More »ఎటువంటి ఉల్లంఘనలు చేయరాదు
కామారెడ్డి, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించుటకు నియమించిన అన్ని విభాగాల అధికారులు సమిష్టి భాగస్వామ్యంతో క్రియాశీలకంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఎన్నికల కంట్రోల్ రూమ్ లో నోడల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి మాట్లాడుతూ ఎన్నికల విధులకు సంబంధించి పూర్తి అవగాహన కలిగి, ఎటువంటి …
Read More »వసతులు లేవు… వెళ్లేదెలా…
ఆర్మూర్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ బస్టాండ్ నిత్యం అనేక మంది ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. బస్ వచ్చేంత వరకు ఎదిరి చూసే ప్రయాణీకులలో పురుషులకు, మహిళలకు మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. తమ బాధ ఎవరితో చెప్పాలని ఆవేదన చెందుతున్నారు. ఆర్మూర్ డిపో మేనేజర్ ఆధ్వర్యంలో ఇటీవల బస్టాండ్‌కు నూతనంగా ముత్రశాలలను మరుగుదొడ్లను మరమ్మత్తులు చేస్తున్న సందర్భంగా …
Read More »విజయ్ హైస్కూలో బతుకమ్మ సంబురాలు
ఆర్మూర్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ విజయ్ హైస్కూల్ ప్రాంగణంలో బతుకమ్మ పండగ సంబురాలను నిర్వహించారు. విజయ్ హై స్కూల్ ప్రిన్సిపాల్ కవితా దివాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులందరూ అత్యంత సంబరంగా జరుపుకోగల బతుకమ్మ పండగ తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అనీ, ఆ పండుగని తెలంగాణ ఆడపడుచులందరూ అత్యంత సంబరంగా, తొమ్మిది రోజుల పాటు ఆడుతూ పాడుతూ … గౌరి దేవిని అత్యంత …
Read More »ఆల్ఫోర్స్ పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలు
ఆర్మూర్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఆల్ఫోర్స్ విద్యాసంస్థలో ముందస్తు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్ రెడ్డి హాజరయ్యారు. చిట్టి బతుకమ్మ ఉత్సవ వేడుకలో భాగంగా శాస్త్రోపేతంగా పాఠశాల ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి దుర్గామాత విగ్రహానికి పూజా కార్యక్రమం నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులలో విద్యార్థినిలు పాఠశాలకి వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన …
Read More »బిఆర్‌ఎస్ ప్రభుత్వం మైనార్టీలను మోసం చేసింది
బాన్సువాడ, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీపీసీసీ రాష్ట్ర మైనారిటీ చైర్మన్ అబ్దుల్లా సోహేల్ ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు పొలిటికల్ అఫ్ఫైర్స్ కమిటీ చైర్మన్ మహమ్మద్ అలీ షబ్బీర్ సూచనమేరకు టీపీసీసీ సభ్యులు బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి కాసుల బాలరాజు సారథ్యంలో శుక్రవారం బాన్సువాడ పట్టణంలో జమా మస్జిద్ (మర్కాస్) వద్దా బిఆర్‌ఎస్ ప్రభుత్వం మైనారిటీ పట్ల అవలంబిస్తున్న వైఫల్యాలను సియాసత్ ఉర్దూ పేపర్‌లోని …
Read More »ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్
బాన్సువాడ, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రయాణికులు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకొని ఆర్టీసీ నగదు బహుమతులను గెలుచుకోవాలని డిపో మేనేజర్ సరితా దేవి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వారు తమ టికెట్ పై ఫోన్ నెంబర్ ఆధార్ నెంబర్ రాసి బస్సులో ఏర్పాటు చేసిన గిఫ్ట్ బాక్స్‌లో …
Read More »నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు
నిజామాబాద్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రస్తుత ఖరీఫ్ లో రైతులు పండిరచిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే విషయంలో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హెచ్చరించారు. ఏ దశలోనూ ఇబ్బందులు ఏర్పడకుండా సాఫీగా ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగేలా సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని సంబంధిత అధికారులకు సూచించారు. వానాకాలం పంట ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి సమీకృత …
Read More »