బాన్సువాడ, అక్టోబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రయాణికులు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకొని ఆర్టీసీ నగదు బహుమతులను గెలుచుకోవాలని డిపో మేనేజర్ సరితా దేవి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వారు తమ టికెట్ పై ఫోన్ నెంబర్ ఆధార్ నెంబర్ రాసి బస్సులో ఏర్పాటు చేసిన గిఫ్ట్ బాక్స్‌లో వేయాలనీ, డ్రాలో గెలుపొందిన ఐదుగురు పురుషులకు ఐదుగురు మహిళలకు 9900 రూపాయల నగదు అందజేయనున్నట్లు ఆమె తెలిపారు.
ఈనెల 21,23 ,28,30 తేదీలలో బస్సుల్లో ప్రయాణించేవారు రిజర్వేషన్ చేసిన ప్రతి ఒక్కరూ ఈ పోటీలకు అర్హులని ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రయాణికులు సురక్షిత సుఖవంతమైన ప్రయాణంతోపాటు బహుమతులు గెలుచుకోవాలన్నారు.