ఆయుధాలు పోలీసు స్టేషన్‌లో అప్పగించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన నేపథ్యంలో నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనరేటు పరిధిలోని ఆర్మ్స్‌ లైసెన్స్‌ పొందిన వారు సెక్షన్‌ 21 ఆఫ్‌ ఆర్మ్స్‌ యాక్టు 1959 ప్రకారం నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనరేటు పరిధిలోని ఆర్మ్స్‌ లైసెన్స్‌ పొంది ఉన్నవారు వారి యొక్క లైసెన్స్‌ ఆయుధాలను సంబంధింత పోలీస్‌ స్టేషన్‌లలో ఈనెల 21వ తేదీలోపు జమ చేయవలసినదిగా కమీషనర్‌ ఆఫ్‌ పోలీసు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిపికేషన్‌ విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు.

ఎవరైనా లైసెన్సు ఆయుధాలు జమ చేయనట్లయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయన్నారు. ఎవరైతే ఉత్తర్వుల నుండి మినహాయింపు కోరుతారో వారు జిల్లా ఆర్మ్స్‌ స్క్రీనింగ్‌ కమిటి నిజామాబాద్‌ పోలీసు కమీషనరేటు కార్యాలయంలోని అదనపు డిప్యూటి పోలీస్‌ కమీషనర్‌ ఎస్‌. జయ్‌రామ్‌ కి రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »