ఆర్మూర్, అక్టోబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మకు శాంతి కలగాలని, న్యాయం జరగాలని కాంగ్రెస్ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్బంగా నాయకులు వినయ్ రెడ్డి మాట్లాడుతు ప్రవళికది ఆత్మహత్య కాదని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన హత్య అని అన్నారు. ఉద్యోగాల కోసం రాత్రి పగలు అనక కష్టపడి చదువుతున్న యువత బిఆర్‌ఎస్ ప్రభుత్వ విధానల వల్ల టిఎస్‌పిఎస్‌సి తప్పిదాల వల్ల వారి కష్టం వృధా అవ్వటంతొ ఆత్మహత్యలకు పాలపడుతున్నా అని, మేం యువతకు చెప్తున్నాము, మీరు మనోధైర్యం కోల్పోకూడదు అని 50 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది అని, రెండు లక్షల ప్రభుత్వ ఖాళీలు భర్తీ చేస్తాం అని, టిఎస్‌పిఎస్‌సిని ప్రక్షాళన చేసి యుపిఎస్‌సి తరహాలో పటిష్టమైన వ్యవస్థ ప్రవేశ పెడుతాం అన్నారు.
కార్యక్రమంలో పిసిసి ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్, నాయకులు మీర్ మాజీద్, అజ్జు, జిమ్మి రవి, రమణ, అబ్దుల్ ఫయిమ్, అజ్జు, బారి పురుషోత్తం, బాలకిషన్, లక్ష్మి నారాయణ, అభినవ్ తదితరులు పాల్గొన్నారు.