ఓటమి భయంతోనే రెండు చోట్ల పోటీ

మాచారెడ్డి, అక్టోబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం అంతంపల్లి గ్రామం నుండి పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, పెద్దలు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్‌ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ అధికార బిఆర్‌ఎస్‌ పార్టీ తొమ్మిదేళ్లలో అభివృద్ధి చేసింది ఏమీ లేదని, చేసిన అభివృద్ధి చెప్పలేకనే కొత్త కొత్త పథకాలతో మరోసారి మభ్యపెట్టడానికి గ్రామాల్లోకి వస్తున్నారని అన్నారు. ఓటమి భయంతోనే కెసిఆర్‌ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని, దళిత బంధు, బిసి బంధు, మైనారిటీ బంధు పేరుతో గ్రామాల్లో ప్రజల మధ్య చిచ్చు పెట్టి బిఆర్‌ఎస్‌ కార్యకర్తలు చోద్యం చూస్తున్నారన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »