బీర్కూర్, అక్టోబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అరవై ఏండ్లలో కూడా జరగని అభివృద్ధి కేవలం ఆరేండ్లలో చేసిన పార్టీ ఏదైనా ఉంటే భారతదేశంలోనే అది బీఆర్‌ఎస్ పార్టీయే అని తెలంగాణ ఉద్యమ రధసారధి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌తోనే సాధ్యం అని, బాన్సువాడ అభివృద్ధి ప్రధాత శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో బాన్సువాడ నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందిందని రాబోయే రోజుల్లో కూడా మరింత అభివృద్ధి జరగాలన్నా ఆదికేవలం బీఆర్‌ఎస్ పార్టీ కెసిఆర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి వల్లనే జరుగుతుందని ఇది వరకు ఎన్నో సంక్షేమ పధకాలు ప్రజందరికి అందాయని ఓటర్లకు వివరిస్తూ కారు గుర్తు కే ఓటేసి శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని శనివరం ప్రచారంలో భాగంగా ప్రజలకు వివరించారు.
ఓటును అభ్యర్థించిన వారిలో నాయకులు పోగు నారాయణ, అబ్దుల్ అహ్మద్, వారితో పాటు నాగరాజు, సాయిలు, మౌనప్ప, శ్రీను తదితరులు ఉన్నారు.