బాన్సువాడ, అక్టోబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని బొర్లం క్యాంప్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9 వ జోనల్ స్థాయి క్రీడా పోటీలలో భాగంగా మూడవ రోజు ఆదివారం వాలీబాల్, కబడ్డీ, కో కో హ్యాండ్ బాల్, హై జంప్, లాంగ్ జంప్, రన్నింగ్, రిలే మొదలైన క్రీడలు జరిగాయి. బొర్లం గురుకుల విద్యార్థినులు కబడ్డీ అండర్ 17 లో సంపూర్ణ,వెన్నెల, కృష్ణవేణి, చందన, మృదుల, అశ్విని, సింధులు ద్వితీయ స్థానం, 400 మీటర్ల అండర్ 17 పరుగు పందెంలో బి. వైష్ణవి ద్వితీయ స్థానం, 100 మీటర్ల అండర్ 17 పరుగు పందెంలో జి. భార్గవి ద్వితీయ స్థానంలో నిలిచారు.
వారి క్రీడా స్ఫూర్తిని ప్రిన్సిపాల్స్ పద్మ కుమారి,లక్ష్మీబాయి, శోభారాణి, పుష్పాలత, నళిని, సవిత, స్వప్న, భువనేశ్వరి, నరసింహారెడ్డి, సత్యనారాయణ, శివరాం, పూర్ణచంద్రరావు, హెన్రీ అభినందించారు. క్రీడలను అందరినీ సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు.
అనంతరం సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా క్యాంప్ ఫైర్ నిర్వహించారు. నృత్య గీతాలతో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి 6 పాఠశాలల హెల్త్ సూపర్వైజర్లు మరియు 15 పాఠశాలల పీడీ, వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.