నిజామాబాద్, అక్టోబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీఆర్‌ఎస్ 51 మంది అభ్యర్థులకు సిఎం కెసిఆర్ ఆదివారం బీఫామ్‌లు అందజేశారు. ఒక్కో అభ్యర్థికి రూ.40 లక్షల చెక్ అందజేశారు. సోమవారం మిగతా అభ్యర్థులకు బీఫామ్‌లు ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రగతిభవన్‌లో బీఫామ్‌లు తీసుకోవాలని తెలిఆరు.
టికెట్ రానివారు తొందరపడొద్దని, ప్రతి ఒక్కరికీ అవకాశాలు వస్తాయని, అభ్యర్థులందరూ సహనంతో ఉండాలన్నారు. కోపతాపాలను అభ్యర్థులు పక్కనపెట్టాలని, ప్రతీకార్యకర్త దగ్గరకు అభ్యర్థులు వెళ్లాలని, చిలిపి పనులతో కొందరు అవకాశాలు కోల్పోయారని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌పై విపక్షాలు కుట్రలు చేస్తాయని, ప్రజల్లో గెలిచినా సాంకేతిక అంశాలతో కుట్ర చేస్తారన్నారు. ప్రతి విషయంపై అభ్యర్థులు క్లారిటీతో ఉండాలని కెసిఆర్ సూచించారు.
ఈ నేపథ్యంలో 51 మంది అభ్యర్థులు బి ఫాం పొందగా వీరిలో ఎంఎల్‌సి కవిత ఉండడం గమనార్హం. అసలు కవిత ఏ నియోజకవర్గం నుండి బి ఫాం పొందారో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. నిజామాబాద్ అర్బన్, రూరల్‌లో నైతే దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే బి ఫాంలు దక్కగా మరి కవితకు బి ఫాం ఇవ్వడంలో ఆంతర్యమేమిటి, ఏ నియోజకవర్గం నుండి ఇచ్చారనేది నాయకులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.
కాగా రాష్ట్ర మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి ఇటీవల చనిపోవడంతో ఆయన ఇంకా కార్యక్షేత్రంలోకి రాలేదు. అయితే ప్రశాంత్‌రెడ్డికి సంబంధించిన బి పాంను ఎమ్మెల్సీ కవిత అందుకున్నారు. అంతే తప్ప కవిత పోటీ చేస్తుందని కాదు.