కామారెడ్డి, అక్టోబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో నిరుద్యోగులను విస్మరించిందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు ఆరోపించారు. ఉద్యోగ కల్పన విషయంలో ఎలాంటి నమ్మకాన్ని తెలంగాణ నిరుద్యోగులకు కల్పించలేకపోయారని ఇలాంటి ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకుంటే మరిన్ని ఇబ్బందులు ఏర్పడతాయని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మూడు సంవత్సరాల నుండి పెండిరగ్లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి మరొక మారు సిద్ధమయ్యారని అన్నారు.