ఎన్నికల అధికారులకు ముఖ్య గమనిక

కామారెడ్డి, అక్టోబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల విధులలో నియమించిన అధికారులందరు కలిసికట్టుగా అర్మీలా పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌ నుండి రిటర్నింగ్‌ అధికారులు, తహసీల్ధార్లు, ఎంపిడిఓలు, ఎంపిఒలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌తో కలిసి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అధికారులందరూ తమకు అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వహిస్తామనే పూర్తి విశ్వాసంతో పనిచేయాలని హితవు చెప్పారు.

ఓటరు జాబితాలో మార్పులు,చేర్పులు, తొలగింపులకు సంబంచించి వచ్చిన ఫారం-7,8 లను ఈ నెల 19 లోగా క్షేత్ర స్థాయిలో పరిశిలించి పరిష్కరించాలన్నారు. జిల్లాలో 51 వేల నూతన ఓటరు ఎపిక్‌ కార్డుల పోస్టల్‌ శాఖ ద్వారా జరుగుచున్న పంపిణీపై దృష్టిపెట్టాలన్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసే నవంబర్‌ 10 వరకు ఓటరు నమోదు జరుగుతుందని, ఆ పిదప అనుబంధ ఓటరు జాబితా సిద్ధం చేయాలన్నారు.

ఎన్నిక ప్రవర్తనా నియమావళి ఖచ్చితగంగా అమలయ్యేలా చూడాలని, చెక్‌ పోస్టులపై నిఘా ఉంచి అనుమానస్పదంగా డబ్బు, మద్యం, కానుకలు తదితర రవాణా జరుగుచుంటే ఎవరిని ఉపేక్షించక స్వాధీనం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా పోలింగ్‌కు 48 గంటల ముందు ఉల్లంఘనలు ఎక్కువగా జరిగే అవకాశముంటుందని, అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

తహసీల్దార్లు, సెక్టోరల్‌ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి రూట్‌ మ్యాప్‌ ఆధారంగా అన్ని పోలింగ్‌ బూతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి మౌలిక వసతులున్నాయా తెలుసుకోవాలన్నారు. పోలింగ్‌ కేంద్రం తప్పని సరిగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉండేలా చూడాలని, లోపలికి, బయటికి వెళ్లేలా దారులునుండాలని, తప్పనిసరిగా వీల్‌చైర్‌ ఉండేలా చూడాలన్నారు.

పోలింగ్‌ కేంద్రాలలో ఫర్నీచర్‌, మంచినీరు, టాయిలెట్స్‌, లైటింగ్‌, ర్యాంపు ఉండేలా చూడాలని, పంచాయతీ కార్యదర్శుల సేవలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్‌ రోజు ఓటరు అవగాహన నిమిత్తం తప్పని సరిగా 4 రకాల పోస్టర్లు ప్రదర్శించాలన్నారు. పోలింగ్‌ శాతం తక్కువగా ఉన్న కేంద్రాలలో దృష్టిపెట్టాలన్నారు. సభలు, సమావేశాలకు సువిధ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో అనుమతులు మంజూరు చేయాలని, వాహనాల అనుమతికి జాగ్రత్తగా పరిశీలించాలన్నారు.

సామాజిక మాధ్యమాలలో వచ్చే బల్క్‌ ఎస్‌.ఏం.ఎస్‌. లకు అనుమతగులు, అసత్యవార్తల కట్టడి చేయాలన్నారు. పోలింగ్‌కు ముందు రోజు డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ నుండి ఈవీఎం, వివిప్యాట్‌లు, మెన్‌ అండ్‌ మెటీరియల్‌ తరలింపునకు చక్కటి ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. అదేవిధంగా రిసిప్షన్‌ సెంటర్‌కు కూడా ప్లాన్‌ చేసుకోవాలన్నారు.

ఏ సందేహాలున్నా నివృత్తి చేసుకోవాలని, సొంత నిర్ణయాలు తీసుకోవద్దని కలెక్టర్‌ అన్నారు. సమావేశంలో రిటర్నింగ్‌ అధికారులు మను చౌదరి, ప్రభాకర్‌, శ్రీనివాస్‌, జిల్లా పరిషద్‌ సీఈఓ సాయ గౌడ్‌, కలెక్టరేట్‌ ఏ.ఓ. మసూర్‌ అహ్మద్‌, ఎలక్షన్‌ సూపరింటెండెంట్‌ ప్రేమ్‌ కుమార్‌, తహసీల్ధార్లు, ఎంపిడిఓలు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »