కామారెడ్డి, అక్టోబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిబీపేట్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన జర్రిపోతుల సంధ్య (25) అనీమియా వ్యాధితో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతుండగా వారికి అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరమని డాక్టర్లు తెలియజేయడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు.
రక్త స్పందన సమూహ నిర్వాహకుడు కానిస్టేబుల్ శేఖర్ సహకారంతో జిల్లా కేంద్రానికి చెందిన రాహుల్ వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణదాతగా నిలిచారని అన్నారు. ఎవరికైనా రక్తం అవసరమని తెలియజేయగానే రక్త దానానికి ముందుకు వచ్చే రక్తదాతలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానం చేసిన రక్తదాత రాహుల్కు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ ఛైర్మెన్, ఐవిఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు.