కామారెడ్డి, అక్టోబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి గడ్డపై పుట్టిన బిడ్డ మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి నుండే పోటీ చేస్తారని, కేసీఆర్‌పై పోటీ చేస్తున్నందున బిఆర్ఎస్ నాయకులు చేసుకున్న సర్వేలో షబ్బీర్ అలీ గెలుస్తున్నారని రిపోర్టులు వస్తున్నాయని కామారెడ్డి డిసిసి అద్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు అన్నారు.
ప్రజాదరణ అన్ని వర్గాల మద్దతు వారికి నిద్ర పట్టకుండా చేస్తున్నాయని, దీన్ని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక కుట్రపన్ని మీడియాలో కథనాలు నడుపుతున్నారన్నారు. కామారెడ్డి ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ కుట్రలన్నిటిని తిప్పి కొట్టాలని, ఎన్నికల్లో ఇలాంటి జిమ్మిక్కులు వారు చాలా చేస్తారని, వీటిని అన్నింటిని కాంగ్రెస్ సైనికులు తిప్పి కొట్టాలన్నారు. రెట్టింపు ఉత్సాహంతో నియోజకవర్గంలో పనిచేయాలని, భారీ మెజారిటితో షబ్బీర్ అలీని గెలిపించుకొని కెసిఆర్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.