నిజామాబాద్, అక్టోబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దసరా పండుగకు ఊరెళ్లే వారు కింద తెలుపబడిన నిబంధనలు తప్పక పాటించాలని కమీషనర్ ఆఫ్ పోలీసు కల్మేశ్వర్ పేర్కొన్నారు.
ఉదయం వేళ రద్దీ పేపర్లు, భాళీ నంచులు, వూల మొక్కలు, హర్ ఏక్ మాల్ వస్తువులను విక్రయించే వారిపై నిఘా ఉంచాలన్నారు. రాత్రయితే అనుమానంగా సంచరించే వారిని పలుకరించాలని సూచించారు. శివారు ప్రాంత కాలనీలలో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతకటం రాత్రి వేళ చోరీలకు పాల్పడటం జరుగుతుందన్నారు.
విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చినమ్మి వెళ్లకూడదని, ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పండని సూచించారు. వీలైనంత త్వరగా వ్రయాణం ముగించుకొని వచ్చేలా ప్రణాళిక వేనుకోండన్నారు. పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎవ్పటిప్పుడు తెలునుకోవడం మంచిదని పేర్కొన్నారు.
ఇంట్లొ కుటుంబ నభ్యులు వెళ్లగా ఉన్న మహిళలు, వృద్దులు ‘అవరిచితులు’ సమాచారం పేరుతో వస్తే నమ్మకండి. ఊరు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులు ఉంచకపోవడమే మంచిది లేదా బ్యాంక్ లాకర్‌లో పెట్టుకోవడం మంచిదన్నారు. కాలనీల వారిగా గస్తీ దళాలను ఏర్పాటు చేనుకోవాలని, తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్ స్టేషన్‌లో నమాచారం అందించండన్నారు.
పోలీస్ శాఖ వారికి దొంగతనాలపై అనుమానితుల నమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించండి. ప్రత్యేకంగా మీ చుట్టు ప్రక్కల వారి ల్యాండ్ ఫోన్ నెంబరు లేదా సెల్‌ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఉంచుకోగలరు. ఎవ్పటికప్పుడు నమాచారం ఇవ్వదలుచుకునేవారు మీ సమీప పోలీసుస్టేషన్లను సంప్రదించాలన్నారు. డయల్ 100 ను నద్వినియోగం చేసుకోవాలని సూచించారు.