కామారెడ్డి, అక్టోబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని ఎస్పీ ఆఫీస్ సమీపంలో ఉన్న కౌంటింగ్ కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. కౌంటింగ్ కేంద్రంలో ఫర్నిచర్, ఇతర వసతులను కల్పించాలని అధికారులకు సూచించారు.
వచ్చే సాధారణ ఎన్నికలు కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, జిల్లా ఎన్నికల విభాగం అధికారి ప్రేమ్ కుమార్, అధికారులు ఇంద్ర ప్రియదర్శిని, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.