బాన్సువాడ, అక్టోబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన బంతిని రమేష్ కూతురు పూజ సెపక్ తక్రా క్రీడలో జాతీయస్థాయికి ఎంపిక కావడంతో మంగళవారం బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు శ్రీనివాస్ గార్గే వారి నివాసానికి వెళ్లి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా క్రీడల్లో రాణించి జాతీయస్థాయికి ఎంపికైన పూజ, కోచ్ శివలను ఆయన శాలువాతో సత్కరించారు. క్రీడ పోటీల్లో పాల్గొనడానికి క్రీడాకారినికి ఆర్థిక స్తోమత లేకపోవడంతో కుటుంబ సభ్యులకు 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉన్న తాను ఆదుకుంటానని వారికి అభయమిచ్చారు. కార్యక్రమంలో ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గార్గే , బిజెపి నాయకులు చిదుర సాయిలు, చీకట్ల రాజు, శేఖర్, రాజాసింగ్, నాంపల్లి శ్యామ్, విశాల్, అజయ్, తేజ తదితరులు పాల్గొన్నారు.