భక్తి శ్రద్ధలతో బతుకమ్మ వేడుకలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంస్కృతి సంప్రదాయాలకు తెలంగాణ పుట్టినిల్లు అని విద్యావేత్త నరాల స్వప్న సుధాకర్‌ అన్నారు. స్థానిక కేర్‌ డిగ్రీ కళాశాలలో బుధవారం బతుకమ్మ సంబరాల వేడుకలను నిర్వహించారు.

వేడుకలను విద్యావేత్త నరాల స్వప్న సుధాకర్‌ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అధ్యాపకులతో కలిసి బతుకమ్మను నరాల స్వప్న సుధాకర్‌ నెత్తిన ఎత్తుకొని ఊరేగించారు. అనంతరం మహిళల బతుకమ్మ ఆటలను తిలకించారు. విద్యాసంస్థల్లో అత్యంత వైభవంగా ఆడబిడ్డలు జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ అని ఈ సంస్కృతి వారసత్వాన్ని కేర్‌ డిగ్రీ కళాశాల విద్యార్థులు ముందు తరానికి తీసుకెళ్లి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులతో పాటు నిజామాబాద్‌ నగర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ బాలకృష్ణ, వైస్‌ ప్రిన్సిపల్‌ నరేష్‌, సందేష్‌, కళ్యాణి, అనురాధ, కవిత, శ్వేత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »