ఆర్మూర్, అక్టోబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కొట్టారుమూరులో గల విశాఖ కాలనీలో రోడ్డు నెంబర్ 6 వద్ద గత 20 రోజుల నుండి మిషన్ భగీరథ పైపు పగిలిపోయి నీరు కలుషితం అవుతుంది.
కావున అధికారులు దీనిని సరిచేసి ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాలని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి ప్రవాహం ఆగిపోయిన తర్వాత పైపులోకి మురికి నీరు వెళ్లి మరుసటి రోజు ఉదయం నీటి విడుదల కాగానే కొద్దిసేపటి వరకు మురికి నీరు వస్తున్నాయని దీనివల్ల డయేరియా వచ్చే అవకాశం ఉందని కాలనీవాసులు అంటున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.