బాన్సువాడ, అక్టోబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని తాడ్కొల్ చౌరస్తా, బీర్కుర్ చౌరస్తాలో పట్టణ సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ సీఎం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో వాహనదారులు వాహనాల్లో అక్రమంగా మద్యం, పరిమితికి మించి డబ్బు ఉన్నట్లయితే జప్తు చేసి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, ఎన్నికల నిబంధనలకు మించి డబ్బు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ధ్రువపత్రాలను చూపించాలన్నారు.
తాడ్కొల్ చౌరస్తాలో పట్టుబడిన లక్ష నగదును ఫ్లయింగ్ స్క్వాడ్‌కు అప్పగించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.