హైదరాబాద్, అక్టోబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్టూడెంట్ మ్యానిఫెస్టోను రాజకీయ పార్టీలు అన్ని విధిగా వారి వారి మ్యానిఫెస్టోలో చేర్చాలి లేనిపక్షంలో రాబోవు ఎన్నికల్లో విద్యార్థులు అందరూ కలిసి ప్రజల్లో చైతన్యాన్ని నింపి గుణపాఠం చెప్పాల్సి వస్తుందన్నారు.
గురువారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల న్యూస్ సెమినార్ హాల్లో ఏబివిపి ఆధ్వర్యంలో స్టూడెంట్ మ్యానిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టోలో ముఖ్యంగా విద్యార్థిని ఉద్యోగం అంశాలను చేర్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయినా కానీ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యార్థులను నిరుద్యోగులను పూర్తిగా విస్మరించి, విద్యాలయాలను ధ్వంసం చేశారని, ఏబీవీపీ చాలా రకాల ఉద్యమాలను చేసి విద్యార్థుల గొంతుకగా నిలుస్తూ కొన్ని సమస్యలను సాధించడం జరిగిందని పేర్కొన్నారు.
అయినప్పటికీ చాలా రకాల సమస్యలు అలానే మిగిలి ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు స్టూడెంట్ మేనిఫెస్టోను ఆయా పార్టీల మేనిఫెస్టోలో పొందుపరచాల్సిందిగా ఏబీవీపీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేసి 8624 పాఠశాలలను పునర్ ప్రారంభించాలని రాష్ట్రంలో యూనివర్సిటీలన్నింటిలోను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేసి బ్లాక్ గ్రాండ్ ను విడుదల, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు.
విద్యా హక్కు చట్టాన్ని ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని, అదేవిధంగా జాతీయ విద్యా విధానం 2020 ను అమలుపరిచి విశ్వవిద్యాలయాల్లో ఉపాధి కల్పించే నూతన కోర్సులను ప్రవేశపెట్టాలన్నారు. టిఎస్‌పిఎస్‌సి ప్రక్షాళన చేసి ఖాళీగా ఉన్న ఒక లక్ష 91 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు.
పై డిమాండ్‌లను రాజకీయ పార్టీలు అన్ని విధిగా వారి వారి మేనిఫెస్టోలో చేర్చాలని, లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో విద్యార్థులు అందరూ కలిసి ప్రజల్లో చైతన్యాన్ని నింపి గుణపాఠం చెప్పాల్సి వస్తుందని ఏబీవీపీ హెచ్చరిస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రaాన్సి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిలు పృథ్వి తేజ, కమల్ సురేష్, శ్రీనాథ్ మరియు స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులు జీవన్, శ్రీరామ్, రాజు మహేష్, హరిప్రసాద్ సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.