కామారెడ్డి, అక్టోబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలింగ్ నిర్వహణ, ఈ.వి.ఏం. ల పై అవగాహన పొందిన మాస్టర్ ట్రైనీలు నియోజక వర్గ స్థాయిలో ప్రిసైడిరగ్ అధికారులు, సహాయ ప్రిసైడిరగ్ అధికారులకు తగు శిక్షణ ఇవ్వవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో మాస్టర్ ట్రైనీలు, నోడల్ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి విషయంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటింగ్ యంత్రాలపై అవగాహన కల్పిస్తూ ఓటింగ్ మెషిన్‌లోవి వివిధ అంశాలపై ట్రైనర్లకు వివరించారు. శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనీలు నియోజక వర్గాలలో ప్రిసైడిరగ్ అధికారులు, సహాయ ప్రిసైడిరగ్ అధికారులు పోలింగ్ సజావుగా నిర్వహించేలా ఈ.వి.ఏం. విప్ ఫ్యాట్ ల నిర్వహణపై అవగాహన కలిగించడంతో పాటు అనుసరించవలసిన విధానాలు, పోలింగ్ అనంతరం చెక్ లిస్ట్ ప్రకారం అందజేయవలసిన వివిధ పత్రాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలించాలన్నారు. సమావేశంలో నోడల్ అధికారి రఘునందన్,తహసీల్ధార్లు, తదితరులు పాల్గొన్నారు.