ఎన్నికల అధికారులకు కీలక సూచనలు

కామారెడ్డి, అక్టోబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తహసీల్ధార్లు, ఎంపిడిఓలు క్షేత్రస్థాయిలో అన్ని పోలింగ్‌ కేంద్రాలను రూట్‌ వారీగా పరిశీలించి పోలింగ్‌కు అనువైన గదిని ఎంపిక చేసి సిద్ధంచేసేలా చూడవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ రిటర్నింగ్‌ అధికారులకు సూచించారు. ప్రధానంగా పోలింగ్‌ కేంద్రాలు గ్రౌడ్‌ ఫ్లోర్‌లోనే ఉండేలా చూడాలని, ఫర్నీచర్‌, విద్యుత్తూ, మంచినీరు, టాయిలెట్స్‌ ర్యాంప్‌ సౌకర్యాలతో పాటు వీల్‌చైర్‌ అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు.

శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి అదనపు కలెక్టర్‌ మను చౌదరితో కలిసి రిటర్నింగ్‌ అధికారులు, డిఎస్పీలు, తహసీల్ధార్లు, ఎంపిడిఓలు, ఎంపిఓలు, నోడల్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటరు అవగాహనకు సంబందించిన 4 రకాల గోడపత్రికలు పోలింగ్‌ కేంద్రాలలో ఏర్పాటుకు సిద్ధం చేసుకోవాలన్నారు.

ఫారం,7,8 లను రోజు వారి మానిటరింగ్‌ చేస్తూ పరిష్కరించాలని, నవంబర్‌ 10 వరకు ఓటరుగా నమోదయిన వారి అనుబంధ జాబితా సిద్ధం చేసుకోవాలన్నారు. సువిధ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో వచ్చే దరఖాస్తులకు 24 గంటలలో అనుమతులివ్వాలని, అట్టి సమాచారాన్ని వ్యయ పరిశీలకుల కమిటీ, కంట్రోల్‌ రూమ్‌కు తెలపాలన్నారు. ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందం వీడియో కవరేజి చేయాలన్నారు.

ఎన్నికల ప్రవర్తనా నియామావళి ఉల్లంఘన ఘటనలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ఎవరిని ఉపేక్షించరాదని కేసులు నమోదుచేయాలన్నారు. పూర్తిగా మంచానికే పరిమితమై లేవలేని ముసలివారు, దివ్యాంగులకు ప్రభుత్వం ఫారం-12 డి ద్వారా ఇంటి నుండే ఓటు వేసే అవకాశం కల్పించిందని అన్నారు. డిస్ట్రిబ్యూషన్‌, రిసిప్షన్‌ కేంద్రాలలో ఈ.వి.ఏం. లను తరలించుటకు లేబర్‌ను సమకూర్చుకోవాలన్నారు.

పోలింగ్‌ అనంతరం ఈ.వి.ఏం. లు నేరుగా రిసిప్షన్‌ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. డబ్బు, మద్యం రవాణా, వివిధ రకాల తాయిలాల రవాణాపై గట్టి నిఘా ఉంచాలని, 10 లక్షల కన్నా ఎక్కువ డబ్బు స్వాధీనం చేసుకుంటే వెంటనే ఆదాయపన్ను టీమ్‌కు తెలపాలన్నారు. ఎన్నికల ఘట్టంలో పోలింగ్‌ రోజు చాలా ముఖ్యమైనదని, ప్రిసైడిరగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడిరగ్‌ అధికారులది కీలకపాత్ర అని అన్నారు.

పోలింగ్‌ సందర్భంగా చేయవలసిన అన్ని అంశాలపై ఎన్నికల సంఘం రూపొందించిన హ్యాండ్‌ బుక్‌ను ప్రతి ప్రిసైడిరగ్‌ అధికారి, సహాయ ప్రిసైడిరగ్‌ అధికారులు తూ.చ తప్పకుండా చదవడమే కాకుండా, అందులోని అన్ని నియమాలను పాటించాలని కలెక్టర్‌ సూచించారు. ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం జారీ చేస్తున్న నూతన నిబంధనలు, రూల్స్‌ ప్రకారం ఎన్నికలను నిర్వహించాలని, ఎన్నికల పట్ల ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యంగా ఉండవద్దని ఆయన కోరారు.

పోలింగ్‌ సందర్బంగా చేయాల్సిన విధులు, చేయకూడని వాటిపై ప్రతి ఒక్కరికి పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఎన్నికల విధులకు నియమించబడిన ఉద్యోగులు ఎలాంటి పార్టీలకు అభ్యర్థులకు అనుబంధంగా ఉండకూడదని, ఎన్నికల ప్రవర్తన నియమావళి కఠినంగా అమలు చేయబడుతున్నందున పూర్తి జాగ్రత్తగా విధులు నిర్వహించాలని చెప్పారు. పోలింగ్‌ రోజు, పోలింగ్‌ ముందు రోజు చేయాల్సిన పనులను చెక్‌ లిస్ట్‌ తయారు చేసుకుని, దాని ప్రకారం విధులు నిర్వహించాలన్నారు.

ముఖ్యంగా పోలింగ్‌ సందర్భంగా ప్రతి పిఓ తీసుకోవాల్సిన మెటీరియల్‌, ఈవీఎంల నిర్వహణ, ఓటరు జాబితా మార్కుడ్‌ కాపీ, పిఓ, ఏపిఓ డైరీ, వారి విధులు, పోలింగ్‌ కేంద్రం బయట ప్రదర్శించినాల్సిన సామాగ్రి, పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించే వారు, మాక్‌ పోల్‌, ఈవీఎం, వివి ఫ్యాట్‌లను ఎలా అనుసంధానం చేయాలి వంటి అన్ని విషయాలు అవగాహన ఉండాలన్నారు.

సమావేశంలో కామారెడ్డి డిఎస్పీ ప్రకాష్‌, ఆర్‌.డి.ఓ. శ్రీనివాస్‌ రెడ్డి, డిఎస్పీలు, తహసీల్ధార్లు, ఎంపిడిఓలు, ఎంపిఓలు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »