బాన్సువాడ, అక్టోబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తాలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా రెండులక్షల రూపాయల నగదు పట్టుకున్నట్లు శుక్రవారం సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశానుసారం వాహనాల తనిఖీ చేపట్టడం జరుగుతుందని జప్తు చేయబడిన డబ్బులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించనున్నట్లు ఆయన తెలిపారు.
ఎవరైనా యాభై వేల రూపాయల కంటే ఎక్కువ డబ్బులు ఆధారాలు లేకుండా తీసుకుని వెళ్ళవద్దని వ్యాపారులు కానీ ప్రజలు కాని శుభకార్యాలు ఉన్న అధిక మొత్తంలో డబ్బులు బంగారం తీసుకెళ్తే జప్తు చేయబడటం జరుగుతుందని ఆయన తెలిపారు. తనిఖీలో ప్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది గోపీనాథ్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.