బాన్సువాడ, అక్టోబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని తాడ్కొల్ చౌరస్తా వద్ద పోలీసులు శనివారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్రవాహనంపై వెళుతున్న పోగు శ్రీనివాస్‌ను తనిఖీ చేశారు.
కాగా అతని నుండి 4.30 లక్షలు స్వాధీనం చేసుకుని ఫ్లయింగ్ స్క్వాడ్‌కు అప్పగించినట్లు పట్టణ సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో 50 వేలకు మించి డబ్బు ఉన్నట్లయితే అందుకు సంబంధించిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలన్నారు.