కామారెడ్డి, అక్టోబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాకు కేటాయించిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివిప్యాట్ లను మొదటి రాండమైజేషన్ ప్రక్రియ ద్వారా నియోజక వర్గాలకు కేటాయించిన వాటిని క్లోజ్డ్ కంటైనర్ ఘట్టి పొలీసు భద్రత మధ్య తరలించి అక్కడ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.
శనివారం ఎస్పీ కార్యాలయం సమీపంలోని ఈ.వి.ఏం. గోదామును అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఆర్.డి.ఓ. శ్రీనివాస్ రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 791 పోలింగ్ కేంద్రాలకు గాను ఎన్నికల కమీషన్ 1297 కంట్రోల్ యూనిట్లు, 1656 బ్యాలట్ యూనిట్లు, 1278 వి.వి.ఫ్యాట్ లను కేటాయించిందని అన్నారు.
జుక్కల్ నియోజక వర్గంలో 255 పోలింగ్ కేంద్రాలకు గాను 25 శాతం బఫర్ తో కలిపి 318 చొప్పున కంట్రోల్, బ్యాలట్ యూనిట్లు, 40 శాతం బఫర్‌తో కలిపి 357 వివి ఫ్యాట్‌లు, యెల్లారెడ్డి నియోజక వర్గంలో 270 పోలింగ్ కేంద్రాలకు గాను 337 బ్యాలట్, కంట్రోల్ యూనిట్లు, 378 వివి ఫ్యాట్‌లు, కామారెడ్డి నియోజక వర్గంలో 266 పోలింగ్ కేంద్రాలకు గాను 332 కంట్రోల్, బ్యాలట్ యూనిట్లు, 372 వివి ఫ్యాట్‌లను అందిస్తున్నామన్నారు.
ఈ ఆర్ ఓ లు బార్ కోడ్ ను స్కాన్ చేసి, బాక్స్ సీరియల్ నంబర్‌ను రిజిష్టర్‌లో నమోదు చేయాలన్నారు. అన్ని యూనిట్లు, వివి ప్యాట్ల పరిశీలన పూర్తైన పిదప క్లోజ్డ్ కంటైనర్‌లో తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమం అంతా అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, ఆర్.డి.ఓ. శ్రీనివాస్ పర్యవేక్షణలో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.