ఆర్మూర్, అక్టోబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామములోని నూతన గ్రామపంచాయతీగ ఏర్పాటైన హరిపూర్ పల్లె గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకుడు గ్రామశాఖ అధ్యక్షులు రాజాగౌడ్, గ్రామ సర్పంచ్ ఇందుర్ సాయన్న ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నివాసంలో బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థి ఆశన్నగారి జీవన్ రెడ్డి వారిని సాదరంగా పార్టీలోకి అహ్వానించారు. ఈ సందర్బంగా రాజాగౌడ్ మాట్లాడుతూ జీవన్ రెడ్డి చేసిన అభివృద్ధికి ఆకర్షితులై హరిపూర్ గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగ ఏర్పాటు చేసినందుకు గాను బిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు అయన తెలిపారు. బిఆర్ఎస్ పార్టీలో చేరినవారిలో బిజెపి ముఖ్యనాయకులు చిగుర్ల మల్లేష్, అది శ్రీను, సిద్ధూ, బాయి మురళి, అబ్బులు, పెంటయ్య, తదితరులు ఉన్నారు.