నిజామాబాద్, అక్టోబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, జగిత్యాల, బాల్కొండ, నిర్మల్ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో గల్ఫ్ సంఘాల నాయకులు పోటీలో నిలుపుతున్నట్లు గల్ఫ్ కార్మికుల ఉద్యమ వేదిక బుధవారం బుధవారం కోరుట్లలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రకటించింది.
వక్తలు మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల డిమాండ్ల సాధన లక్ష్యంగా ఎన్నికలు ఎత్తుగడగా తమ పోరాటం కొనసాగిస్తామని అన్నారు. రైతులు, బీడీ కార్మికులను కలుపుకొని ముందుకు వెళతామని అన్నారు.
గల్ఫ్ కార్మిక ఉద్యమ నాయకులు గుగ్గిల్ల రవిగౌడ్, చెన్నమనేని శ్రీనివాస్ రావు (సిఎస్ఆర్), మంద భీంరెడ్డి, బూత్కూరి కాంత, పెనుకుల అశోక్, సంగెం మోహన్ రెడ్డి, బైరి రవి, కారం మారుతి, బీడీ కార్మిక నాయకులు రాపెల్లి శ్రీనివాస్, చెన్న విశ్వనాధం తదితరులు పాల్గొన్నారు.