Daily Archives: October 26, 2023

పోలీసు శాఖ ఆద్వర్యంలో క్యాండిల్‌ ర్యాలీ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీసు ఫ్లాగ్‌ డే పురస్కరించుకొని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కల్మేశ్వర్‌ శింగెనవార్‌ ఆదేశాల మేరకు అదనపు డిప్యూటి కమీషనర్‌ ఆఫ్‌ పోలీసు గిరిరాజు ఆధ్వర్యంలో క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. పాత కలెక్టరేట్‌ మైదానం నుండి ర్యాలీ ప్రారంభమై ఎల్‌ఐసి చౌరస్తా, మునిసిపల్‌ కార్యాలయం, ఎన్‌టిఆర్‌ చౌరస్తా, పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌ వరకు నిర్వహించారు. …

Read More »

భారతీయలందరి ఆత్మ మట్టిలోనే ఇమిడి ఉంది

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనాదికాలం నుంచి ఈ దేశంలో జన్మించిన కోట్లాదిమంది దేశభక్తుల యొక్క అంతరాత్మ ఈ మట్టిలోనే మమేకమై ఉందని, మనం పుట్టింది మొదలు చనిపోయేదాకా ఈ మట్టితోనే కలిసి జీవిస్తామని, చివరికి చనిపోయిన తర్వాత ఈ మట్టిలోనే కలిసిపోతామని అందుకే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర భారత అమృతోత్సవాల ముగింపు స్మారకంగా ఢల్లీిలో నిర్మించ తలపెట్టిన జాతీయ …

Read More »

రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దగ్దం

కామారెడ్డి, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజంసాగర్‌ చౌరస్తాలో బిఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రేవంత్‌ రెడ్డి మరి కొంత నాయకుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్‌ రెడ్డి, పట్టణ యూత్‌ అధ్యక్షులు చెలిమెల భానుప్రసాద్‌, కౌన్సిలర్‌ ముప్పరపు ఆనంద్‌ మాట్లాడారు. తెలంగాణ వ్యతిరేకి కాంగ్రెస్‌ పార్టీ రేవంత్‌ రెడ్డి అన్నారు. …

Read More »

ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ ను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్‌ సీల్‌ను తెరిచారు. ఎన్నికల నిర్వహణ కోసం శాసనసభ నియోజకవర్గ కేంద్రాలకు రాండమైజేషన్‌ ద్వారా బ్యాలెట్‌ యూనిట్‌లు, కంట్రోల్‌ యూనిట్లు, వీ.వీ.ప్యాట్లను ఇటీవలే తరలించిన విషయం విదితమే. తరలింపు పూర్తయిన …

Read More »

ఎన్నికల విధులు నిష్పక్షపాతంగా నిర్వర్తించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంతో బాధ్యతతో కూడుకుని ఉండే ఎన్నికల విధులను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌ సూచించారు. రాష్ట్ర శాసనసభ -2023 ఎన్నికలను పురస్కరించుకుని స్టాస్టిక్‌ సర్వైలెన్స్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తదితర నిఘా బృందాల అధికారులకు గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శిక్షణ …

Read More »

బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లకు అనుమతి పొందాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల కమీషన్‌ నియమావళి మేరకు వివిధ రాజకీయ పార్టీల ప్రకటనలకు సంబంధించి మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ నుండి ముందస్తుగా అనుమతి పొందిన వాటినే ప్రసారం, ముద్రణ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరం నందు ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. …

Read More »

నేటి పంచాంగం

గురువారం, అక్టోబరు 26, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి ఉదయం 8.01 వరకు తదుపరి త్రయోదశి తెల్లవారుజాము 5.48 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర ఉదయం 10.48 వరకుయోగం : ధృవం ఉదయం 9.02 వరకుకరణం : బాలువ ఉదయం 8.01 వరకు తదుపరి కౌలువ సాయంత్రం 6.54 వరకు ఆ తదుపరి తైతుల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »