నిజామాబాద్, అక్టోబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్‌ను తెరిచారు. ఎన్నికల నిర్వహణ కోసం శాసనసభ నియోజకవర్గ కేంద్రాలకు రాండమైజేషన్ ద్వారా బ్యాలెట్ యూనిట్‌లు, కంట్రోల్ యూనిట్లు, వీ.వీ.ప్యాట్లను ఇటీవలే తరలించిన విషయం విదితమే.
తరలింపు పూర్తయిన మీదట ఇంకనూ ఈవీఎం గోడౌన్ లో మిగిలి ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించి, నిబంధనలను అనుసరిస్తూ వాటిని భద్రపరిచేలా పర్యవేక్షణ చేశారు.
సీ.యూ, బీ.యూ, వివి.ప్యాట్లకు సంబంధించిన వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకుని, సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.