కామారెడ్డి, అక్టోబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజంసాగర్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి మరి కొంత నాయకుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, పట్టణ యూత్ అధ్యక్షులు చెలిమెల భానుప్రసాద్, కౌన్సిలర్ ముప్పరపు ఆనంద్ మాట్లాడారు.
తెలంగాణ వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్నారు. రైతులను దళితులను సీఎం కేసీఆర్ ఆదుకుంటే, ఆ పథకాలు ఇవ్వద్దని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారని, దీన్ని బట్టి చూస్తే రైతులకు దళితులకు మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులను రైతుబంధు, దళిత బంధు ఇవ్వద్దని ఎందుకు ఫిర్యాదు చేశావు అని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని అన్నారు.
కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మామిండ్ల అంజయ్య, రైతు మండల సమన్వయ కన్వీనర్ లింగారావు, పట్టణ ఉపాధ్యక్షులు లక్కాకుల రాజు, కౌన్సిలర్స్ రవికుమార్, తాటి ప్రసాద్, భూమేష్ యాదవ్, నారాయణరావు, సంగమేశ్వర్, అనిఫ్, బాలకిషన్, శేఖర్, గోపాల్, నవీన్, అంజయ్య, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.