కామారెడ్డి, అక్టోబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్కే డిగ్రీ కళాశాలలో కామారెడ్డిలో నూతనంగా తీసుకువచ్చిన బిఎస్సి అగ్రికల్చర్ కోర్స్‌పై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ నుంచి జాయింట్ డైరెక్టర్ రాజేంద్ర సింగ్ ముఖ్యఅతిధిగా విచ్చేసి కోర్స్ యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు.
అగ్రికల్చర్ బీఎస్సీ యొక్క అవశ్యకతను దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ మూడు సంవత్సరాల బిఎస్సి అగ్రికల్చర్ కోర్స్ ఎంతో విశిష్టమైనదని తెలంగాణ రాష్ట్రంలో కేవలం కొన్ని కళాశాలకు మాత్రమే అవకాశం వస్తే మన కామారెడ్డి జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఆర్కే కాలేజ్‌కి ఇవ్వడం అభినందనీయమన్నారు.
విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని, వ్వవసాయ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని భవిష్యత్తులో ఉత్తమ స్థానంలో ఉద్యోగాలు సాధించాలని సూచించారు.
అదేవిధంగా ఆర్కే సీఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆర్కే కళాశాల క్వాలిటీ ఎడ్యుకేషన్‌తో పాటు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వినూత్నమైన ఉపాధి అవకాశాలు కలిగినటువంటి కోర్సులను ప్రవేశపెడుతుందని, దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం బిఎస్సి హానర్స్‌తో పాటు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు ప్రవేశ పెట్టడం జరిగిందని దీనికి ఎంతో విశిష్టమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ కిష్టయ్య, రవి కుమార్, ప్రిన్సిపల్స్ సైదయ్య, నవీన్, గోవర్ధన్ రెడ్డి వైస్ ప్రిన్సిపల్స్ ఏవో అధ్యాపకులు, అగ్రికల్చర్ బీఎస్సీ స్టూడెంట్స్ పాల్గొన్నారు.