కామారెడ్డి, అక్టోబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో శాసనసభ ఎన్నికలు సజావుగా నిర్వహించుటకు ఏర్పాటు చేసిన బృందాలన్నీ పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల విధులు, బాధ్యతలపై నోడల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి మాట్లాడుతూ ఎన్నికలలో ప్రధానమైన టీమ్‌లలో మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, వ్యయ నిర్వహణ కమిటీల పాత్ర ప్రధానమైనవని, ఈ రెండు కమిటీలు చక్కటి సమన్వయంతో పనిచేస్తే ఎలాంటి ఒత్తిడులు లేకుండా మిగతా ఎన్నికల ప్రక్రియ సజావుగా బీచేయవచ్చని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, సి-విజిల్ యాప్, సువిధ, ఏం.సి.సి., వ్యయ నిర్వహణ కమిటీ, ఏం.సి.ఏం.సి. కమిటీల పనితీరును తెలుసుకుంటూ దిశా నిర్దేశం చేశారు. శనివారం, సోమవారం ప్రిసైడిరగ్, సహాయ ప్రిసైడిరగ్ అధికారులకు మాస్టర్ ట్రైనీల ద్వారా శిక్షణ ఇవ్వనున్నామన్నారు.
ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమీషన్ కు రోజు వారి సమర్పించే నివేదికలతో పాటు వారు కోరిన విధంగా నివేదికలు ఎప్పటికప్పుడు ఇచ్చుటకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో నోడల్ అధికారులు కిషన్, సిమ్హారావు, సురేందర్ కుమార్, రాజు, బావయ్య, శ్రేనివాస్, శాంతికుమార్, ప్రవీణ్ కుమార్, కలెక్టరేట్ ఏ.ఓ. మసూర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.