కాసుల బాలరాజుకు టికెట్‌ కేటాయించాలి

బాన్సువాడ, అక్టోబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

శాసనసభ ఎన్నికల అభ్యర్థులకు మున్నూరు కాపు కులస్తులకు టికెట్లు కేటాయించాలని శనివారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డికి మున్నూరుకాపు రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్‌ మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రకటించిన అసెంబ్లీ స్థానాల్లో మున్నూరుకాపు కులస్తులకు సీట్లు తక్కువ కేటాయించారని, ప్రస్తుతం పెండిరగ్‌ ఉన్న స్థానాల్లో బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కాసుల బాలరాజుకు టికెట్‌ కేటాయించాలని ఆయన కోరారు.

బాన్సువాడ నియోజకవర్గంలో బీసీ ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉండడంతో కాసుల బాలరాజ్‌ తప్పకుండా గెలిచి వస్తారని ఆయన అన్నారు. కార్యక్రమంలో మున్నూరు కాపు రాష్ట్ర నాయకులూ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చు…

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »