కామారెడ్డి, అక్టోబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వ్యయ నిర్వహణకు సంబంచించి ఎన్నికల కమీషన్ రూపొందించిన చట్టాలు, సెక్షన్ల పై అకౌంటింగ్ టీమ్‌కు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. శనివారం కలెక్టరేట్ మినీ సమావేశమందిరంలో వ్యయ నిర్వహణ, ఏం.సి.సి. నోడల్ అధికారులు, సహాయ ఎన్నికల పరిశీలకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నవంబర్ 3 న ఎన్నికల నోటిఫికేషన్, విడుదలై నామినేషన్ల స్వీకరణ ఉంటుందని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లాకు నియమించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు 3న రానున్నారని, నాటి నుండే అభ్యర్థులు ఖర్చు వ్యయ నిర్వహణ అకౌంటింగ్ టీమ్ చూడవలసిన బాధ్య ఉంటుందని అన్నారు. వ్యయ నిర్వహణ రిజిస్టర్లు పక్కాగా నిర్వహించుటకు, రోజువారి నివేదికలు ఎన్నికల కమీషన్‌కు పంపించుటకు ఏమి కావాలో, ఏమి సిద్ధం చేసుకోవాలో ఒక నిర్దిష్ట ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.
సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌టి, విఎస్‌టి, వివిటి, ఫ్లైయింగ్ స్క్వాడ్, కంట్రోల్ రూం, ఎంసిఎంసి తదితర అన్ని బృందాలు నాటి నుండి చురుకుగా అన్ని కార్యక్రమాలు నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల ఖర్చుకు సంబంధించి ఏ నమూనాలో వివరాలు ఇవ్వాలో వారికి అవగాహన కలిగించాలన్నారు.
అభ్యర్థి ఒకే బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలని, ఆ ఖాతా ద్వారానే ప్రతిరోజు ఖర్చు లావాదేవీలు జరగాలని, ప్రతి ఖర్చును చెక్కు, డి.డి. రూపంలో చెల్లించాలని, రోజు పది వేల రూపాయల కంటే నగదు చెల్లించరాదని స్పష్టం చేసారు. రిటర్నింగ్ అధికారులు, అనుమతులు ఇచ్చే అధికారులతో సమన్వయము చేసుకుంటు రోజువారి ఖర్చు వివరాలు నమోదు చేయాలన్నారు.
సామాజిక మాధ్యమాలలో వచ్చే బల్క్ ఎస్.ఏం.ఎస్.లు, స్ట్గార్ క్యాంపెనింగ్ తదితర వాటికి సంబందించిన ఖర్చు వివరాలను షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. ఓటరు నిర్భయంగా, స్వేఛ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకొనుటకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుందని, ఎలాంటి ప్రలోభాలకు, తాయిలాలకు లొంగకుండా ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కలిగించాలని సూచించారు. సమావేశంలో నోడల్ అధికారులు కిషన్, సింహ రావు, ఏ.ఈ.ఓ.లు తదితరులు పాల్గొన్నారు.