కామారెడ్డి, అక్టోబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల నిర్వహణలో ప్రిసైడిరగ్ అధికారులు, సహాయ ప్రిసైడిరగ్ అధికారుల పాత్ర కీలకమని బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శనివారం స్థానిక డిగ్రీ కళాశాలలో కామారెడ్డి నియోజక వర్గానికి చెందిన పి .ఓ.లు, ఏ.పి .ఓ.లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో 50 మందికి ఒక మాస్టర్ ట్రైనీబీచొప్పున 500 మంది పి .ఓ.లు, ఏ.పి .ఓ లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ సజావుగా, ప్రశాంతాగా నిర్వహించుటలో కీలకంగా వ్యవహరించే పి .ఓ.లు, ఏ.పి .ఓ లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వి.వి ప్యాట్స్ వినియోగం తీరుపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. కమీషనింగ్‌లో బ్యాలెట్ యూనిట్‌లో బ్యాలట్ పేపర్ అమరిక, పోటీలో ఉన్న అభ్యర్థుల లిస్టు, మాక్‌పోల్ చేసి వచ్చిన ఏజెంట్లకు మాక్‌పోల్ ఈవిఎం రిజల్ట్ సరిచేసి చూపించడం, ఇ.వి.ఎమ్‌లు, వి.వి.ప్యాట్స్ వినియోగం తీరుపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు.
పోలింగ్ ప్రారంభించుటకు ముందు మాక్ పోలింగ్ నిర్వహించి క్లియర్ చేయాలన్నారు. పోలింగ్ అనంతరం క్లోజ్ చేయాలన్నారు. ఇ.వి.ఎమ్‌లు, వి.వి.ప్యాట్స్ కనెక్షన్లు సరిగా కనెక్ట్ చేసింది లేనిది సరిచూసుకోవాలన్నారు. బ్యాలెట్ యూనిట్లు సెట్టింగ్‌ను తనిఖీ చేసుకోవాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి ఎన్నికల సామాగ్రి తీసుకునేటప్పుడు చెక్ లిస్ట్ ప్రకారం సరి చూసూకోవాలన్నారు.
చెక్‌లిస్ట్, హ్యాండ్ బుక్ అనెక్సర్ 3, అనెక్సర్ 9 చదవడం ద్వారా ఏమి చేయాలో ఒక అవగాహన వస్తుందని అన్నారు. హ్యాండ్ బుక్‌లో క్రిటికల్‌గా చేసే తప్పులు, సాధారణంగా చేసే తప్పులపై స్పష్టంగా పేర్కొనడం జరిగిందని అలాంటి తప్పులు జరగకుండా చూడాలన్నారు. పోలింగ్ విధులు చాలా సులభతరమని, తమ టీమ్‌కు నాయకత్వం వహిస్తూ ఎవరు ఓటరు జాబితా మార్కింగ్ చేయాలి, సిరా ఎవరు పెట్టాలి, ఎవరు యంత్రాలు మానిటరింగ్ చేయాలో స్పష్టమైన అవగాహన ఉంటె పోలింగ్ సజావుగా సాగుతుందని, రీ-పోలింగ్ అనే సమస్యలు ఉత్పన్నం కావని అన్నారు.
ప్రిసైడిరగ్ అధికారుల డైరీ ముఖ్యపాత్ర ఉంటుందని, జాగ్రత్తగా రాయాలని, సూచించారు. ఏ సందేహాలున్న సెక్టోరల్ అధికారులను సంప్రదించాలని, స్వంత నిర్ణయాలు తీసుకోవద్దని హితవు చెప్పారు. కార్యక్రమంలో ఆర్.డి.ఓ. శ్రీనివాస్ రెడ్డి, డీఈఓ రాజు, తహశీల్ధార్, లత, పి .ఓ.లు, ఏ.పి .ఓ.లు తదితరులు పాల్గొన్నారు.