కామరెడ్డి, అక్టోబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కష్టపడాలని
రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కలకుంట్ల మదన్ మోహన్ రావు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం సదాశివ నగర్, తాడువాయి, రామారెడ్డి, గాంధారి మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో అభ్యర్థి మదన్మోహన్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఎల్లారెడ్డి కాంగ్రెస్ టికెట్ లభించినందుకు ఆయా మండలాల కార్యకర్తలు అభ్యర్థి మదన్ మోహన్ కృతజ్ఞతలు తెలిపి అభ్యర్థిత్వం ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానంకు సంతోషం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రజల కష్టాలలో పాలు పంచుకుని సేవలు అందించినందుకు కాంగ్రెస్ అధిష్టానం పోటికి అవకాశం ఇచ్చిందని, నియోజకవర్గంలోని 250 గ్రామాలలో ప్రతి గడప గడపను కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలను ప్రచారం చేయాలని మదన్మోహన్ కార్యకర్తలకు సూచించారు.
30 రోజులు కార్యకర్తలు రాత్రి పగలు అనకుండా కష్టపడాలని ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని సూచించారు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ గెలుపు లక్ష్యంగా కార్యకర్తలు కష్టపడాలని దిశా నిర్దేశం చేశారు. తనని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో కీలకంగా జగనన్న అసెంబ్లీ ఎన్నికలలో ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్లి హస్తం గుర్తుకు ఓటు వేసేలా కష్టపడాలని సూచించారు.
భారీ సంఖ్యలో మదన్మోహన్ సమక్షంలో చేరిన ప్రజాప్రతినిధులు కార్యకర్తలు రాజంపేట మండలం గుడి తండా ఉపసర్పంచ్ దేవీ సింగ్ టిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజంపేట మండల టిఆర్‌ఎస్ నాయకులు బన్సీలాల్ టిఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మదన్ మోహన్ చేపడుతున్న సేవలకు ఆకర్షించి రాజంపేట నుండి భారీసంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన ప్రజా ప్రతినిధులు యువకులకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి మదన్మోహన్ ఆహ్వానం పలికారు. రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామ యువకులు భారీ సంఖ్యలో మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధిష్టానం తమ నేతకు ఎల్లారెడ్డి టికెట్ ఇచ్చినందుకు గాంధారి మండలానికి చెందిన ఎంపీటీసీ కామెల్లి బాలరాజ్ కాంగ్రెస్ నాయకులు మదర్ లయన్ రమేష్, దేవి సింగ్ ,సుభాష్‌లు కృతజ్ఞతలు తెలిపారు.