కామారెడ్డి, అక్టోబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు శిక్షణ తరగతులు శ్రద్ధగా విని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం కామారెడ్డి నియోజకవర్గం పి.ఓ, ఏ.పి.ఓ, పోలింగ్ సిబ్బందికి కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ… ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ట్రైనింగ్ క్లాస్ లను ఆషామాషీగా తీసుకోకుండా సీరియస్ గా తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ డే సందర్భంగా పి.ఓ లు తీసుకోవాల్సిన చర్యలు, బాధ్యత పై క్లుప్తంగా వివరించారు. ఎన్నికల కమిషన్ ప్రతి అంశానికి విధులకు సంబంధించిన నిబంధనలు జారీ చేసిన నేపథ్యంలో పి.ఓ బుక్‌ను పొందుపర్చిన నియమావళి ప్రకారం గా విధులు నిర్వహించాలన్నారు. మాక్ పోలింగ్ సందర్భంగా పాటించవలసిన అంశాల గురించి వివరించారు. మాక్ పోలింగ్ ఉదయం 5.30 గంటల లోగా పూర్తి చేయాలని, కనీసం ఇద్దరు ఏజెంట్లు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ఆ తర్వాత 15 నిమిషాల సమయంవేచి చూసి రాని పక్షంలో పి.ఓ నే చేయాలని తెలిపారు.
కొందరు పి.ఓ లు శిక్షణ కు రాకుండా ఓవర్ కాన్ఫిడెన్సుతో తప్పులు చేస్తారాని అన్నారు. డిస్ట్రిబ్యూషన్ రోజు ఈ.వి.ఎంలు తీసుకొని పోలింగ్‌డే పూర్తయిన తర్వాత సాయంత్రం కాగానే తిరిగి ఇవ్వవలసిన బాధ్యత పి.ఓ లేదన్నారు. పొలిటికల్ ఏజెంట్ మిమ్ములను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. దానికి సమాధానం చెప్పాల్సింది పి.ఓ అధికారి దే పూర్తి బాధ్యత. పోలింగ్ డే రోజు మీరే బాస్ ఎవ్వరికీ బాధ్యత ఉండదని, పోల్ తర్వాత రిపోర్ట్ తయారు చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ని సమర్థవంతంగా అమలు చేయాలని, తప్పులు జరిగితే క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటారు.
ఎన్నికల సమయంలో సస్పెండ్ చేస్తే ప్రభుత్వం కూడా పట్టించుకోదని తెలిపారు. టౌన్‌లో పోలింగ్ రోజు ఏజెంట్ కూడా గుర్తుపట్టరు కాబట్టి సమస్య వస్తుంది, అనుమానాలు ఉంటే చెప్పండి. ఎన్నికల పి.ఓ బుక్ పాలోకావాలి. రెండవ ట్రైనింగ్ పెట్టడం జరుగుతుందన్నారు. ఓటరు జాబితాలో పేరు ఉంటేనే ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటరు బూత్ దగ్గర బి.ఎల్.ఓ సహాయక కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. మెయిన్ ఓటరు జాబితా ఏఎస్‌డి లిస్ట్ కూడా ఉంటుందని దానిని పరిశీలన చేసుకోవాలని తెలిపారు. ఓటరు జాబితాలో పేరు ఉంటేనే లోనికి రానివ్వాలని నిర్దేశించిన సమయంలో పోలింగ్ ఏజెంట్ ఉండాలి. ఓటరు స్లీప్ ఐడి కాదని, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన 12 ఐడి కార్డులు తీసుకొని రావాలి.
రిసెప్షన్ సెంటర్‌లో టేబుల్ ఎక్కువగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తొందరగా పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. రిసెప్షన్ సెంటర్ నుండి పోలింగ్ సిబ్బందికి తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రాన్స్ పోర్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలింగ్ బూత్ వద్ద కనీస ఏర్పాట్లు చేస్తున్నాం. టాయిలెట్, త్రాగు నీరు, లైటింగ్, దోమల నివారణకు ఒడోమస్ ఏర్పాటు చేస్తామన్నారు. మహిళా సిబ్బంది ఇంటికి వెళ్లి తిరిగి మాక్ పోలింగ్ ముందు ఉదయం 5గంటల వరకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సారీ ఎన్నికల కమిషన్ ఎన్నికలలో పాల్గొనే మహిళ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.
ఈ.వి.ఎం ల బాధ్యత పి.ఓ లదే అన్నారు. పి.ఓ పురుష అధికారి గా నియమిస్తే ఏ.పి.ఓ గా మహిళా అధికారిని పి.ఓ గా మహిళా అధికారిగా నియమిస్తే ఏ.పి.ఓ గా పురుష అధికారిని నియమించనున్నట్లు తెలిపారు. పోలింగ్ ఏజెంట్ స్థానిక పోలింగ్ స్టేషన్ లో ఉంటే అతనికి ఓటరు జాబితాలో పేరు ఉంటేనే ఓటు వేయాలి. పోలింగ్ బూత్ ఏజెంట్ ఆ నియోజకవర్గంలో ఓటరు అయి ఉండాల్లి అంధులు ఓటు వేసే సందర్భంగా 18 సంవత్సరాల వయస్సు దాటిన వారు మాత్రమే అర్హులు. సహాయకులుగా వచ్చిన వారికి రైట్ హ్యాండ్ నెక్స్ట్ ఫింగర్ కు సిరా చుక్క వేయాలి.
ఈ.వీ.ఎం తీసుకొని ఎక్కడకు వెళ్లకూడదు. పోలింగ్ సిబ్బందికి సర్వీస్ ఓటరు గా ఫారం-12 డి ఇవ్వడం జరుగుతుంది. ఆలోచించుకొని రండి. నెక్స్ట్ ట్రైనింగ్ క్లాస్ లో అందజేయడం జరుగుతుంది. ఇంటికి తీసుకుని పోకుండా అక్కడిక్కడే ఓటు వేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఎలక్షన్ కు నిబంధనలు మారుతున్న నేపథ్యంలో పి.ఓ లు శిక్షణ తరగతులు శ్రద్ధగా విని ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి అని అన్నారు.
సమావేశంలో కామారెడ్డి ఆర్.ఓ . శ్రీనివాస్ రెడ్డి, మాస్టర్ శిక్షకులు, అధికారులు పాల్గొన్నారు.