డిచ్‌పల్లి, అక్టోబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ గా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ వాసి డా.పాత నాగరాజుకు నియామకపు ఉత్తర్వులు తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి, మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన అర్థశాస్త్ర విభాగానికి చెందిన సహ ఆచార్యులు డాక్టర్ పాత నాగరాజుకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్‌కు డైరెక్టర్ గా ఉత్తర్వులు అందజేశారు.
గతంలో డాక్టర్ నాగరాజు పాత అర్థశాస్త్ర విభాగాధిపతిగా, పాఠ్య ప్రణాళిక సంఘ అధ్యక్షులుగా, పరీక్షల విభాగంలో అడిషనల్ కంట్రోలర్‌గా, కంట్రోలరుగా సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వహించారు. పరీక్షలు మరియు మూల్యాంకనం పారదర్శకంగా నిర్వహించడంలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి వీసీ, రిజిస్టార్ల ప్రోత్సాహంతో మూల్యాంకణంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆన్లైన్లో మూల్యాంకనం ప్రారంభించారు.
పరీక్షల విభాగంలో కీలకంగా పనిచేసి న్యాక్ గుర్తింపులో ప్రధాన భూమిక పోషించారు. సారంగపూర్ లోని బి.ఎడ్ కాలేజీ ప్రిన్సిపల్ గా బాధ్యతలు నిర్వహించి ఉన్నత అధికారుల మన్ననలు పొందారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు కనుగుణంగా పోటీ పరీక్షలలో విద్యార్థులకు శిక్షణ నిచ్చి వారిలో నైపుణ్యాలను అభివృద్ధిపరిచి పలు కంపెనీలను విశ్వవిద్యాలయానికి ఆహ్వానించి విద్యార్థులకు ప్లేస్మెంట్ అవకాశం కల్పించాలని రిజిస్ట్రార్ ఆచార్యయం యాదగిరి మార్గనిర్దేశం చేశారు.
అనంతరం విశ్వవిద్యాలయంలో పలువురు అధ్యాపకులు, పూర్వ రీసర్చ్ స్కాలర్లు, కామారెడ్డి జిల్లా అర్థశాస్త్ర అధ్యాపక బృందం శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయం ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్‌కు డైరెక్టర్‌గా నియమించినందుకు తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ వాకాటి కరుణ, రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరికి కృతజ్ఞతలు తెలిపారు.