బాన్సువాడ, అక్టోబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ మండలంలోని మొగులాన్ గ్రామ శివారులో బాన్సువాడ ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంత ప్రమాదకరంగా మారి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తామని చెబుతున్న క్షేత్రస్థాయిలో గుత్తేదారులు నాసిరకం పనులు చేపట్టి పనులపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ప్రధాన రోడ్లపై గుంతలు ఏర్పడి వాహనదారులు ప్రమాదాల గురై ప్రాణాలు కోల్పోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు గుంతను సరిచేసి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.