ఎల్లారెడ్డి, అక్టోబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కలకుంట్ల మదన్మోహన్ రావు
రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుందని ప్రభంజనం సృష్టిస్తుందని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు పేర్కొన్నారు. వర్షం వస్తే కొత్త నీరు వస్తుందని టిఆర్‌ఎస్ లాంటి పాతనీరు వెళ్లిపోతుందని రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కలకుంట్ల మదన్మోహన్ రావు పేర్కొన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ టికెట్ వచ్చిన మొదటిసారి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. అంతకుముందు ఎల్లారెడ్డి పట్టణంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుందని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కార్యకర్తలు సైనికుల పనిచేసే కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించాలని మదన్ మోహన్ రావు కోరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పేదలకు పక్కా ఇల్లు కట్టించేందుకు శపథం చేస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ హామీలు గ్రామాలలో అపూర్వ ఆదరణ లభిస్తుందన్నారు. యువతకు ఫ్యాక్టరీలు నెలకొల్పి ఉపాధికల్పన తన తపన అని చెప్పారు. రాబోయే 30 రోజులు రాత్రి పగలు లేకుండా సైనికుల్లా కార్యకర్తలు కష్టపడాలన్నారు.
ఎల్లారెడ్డి 119 రాష్ట్రంలోని నియోజకవర్గాలలో అత్యంత వెనుకబడిన ప్రాంతమని కాంగ్రెస్‌కు అత్యధిక మెజారిటీ రావాలని అందరూ పట్టుదలతో కష్టపడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. యువతకు ఉపాధి కోసం జాబు మేళాలు నిర్వహిస్తే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతానని హామీ ఇచ్చారు. సొంత ఇల్లు ఎల్లారెడ్డిలో ప్రధాన సమస్య అని ఇల్లు లేక వేలాదిమంది పేద ప్రజలు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎల్లారెడ్డి లో నిరుద్యోగ సమస్య తాండవిస్తుందని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గ్రామాలలో తండాలలో వైద్య సౌకర్యం లేక ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో కనీస సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. ప్రజల నుండి తాను డబ్బు ఆశించననీ తనకు దేవుడిచ్చినంత వరకు తనకు అమెరికాలో కంపెనీలు భూములు ఉన్నాయని ప్రజలనుండి ఒక్క రూపాయి ఆశించవద్దని తన భార్య పిల్లలు తనతో హామీ తీసుకున్నారని మదన్ మోహన్ రావు పేర్కొన్నారు.
పేదల ఇల్ల నిర్మాణానికి యువత ఉపాధి కోసం పేదరిక నిర్మూలన కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. ఎల్లారెడ్డిలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి శాయశక్తుల కృషి చేస్తానని చెప్పారు. తాను ఎమ్మెల్యే గెలిచాక పార్టీలు మారనని డబ్బులకు అమ్ముడు పోనని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. భూముల కోసం కేసీఆర్ కామారెడ్డి వస్తున్నారని కామారెడ్డిలో కేసీఆర్‌కి ఓటమి తప్పదని మదన్ మోహన్ రావు జోష్యం చెప్పారు.
టికెట్ రాకుంటే కాంగ్రెస్ జెండా కాల్చడం వడ్డేపల్లి సుభాష్ రెడ్డి చేసిన తప్పని చెప్పారు. అత్యంత వెనుకబడిన ఎల్లారెడ్డిలో ప్రజలను సమస్యలు పీడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆపదలలో వైద్య సౌకర్యాలలో కష్టాలలో మదన్ మోహన్ రావు వెన్నంటే ఉంటాడని హామీ ఇచ్చారు. వైద్య సౌకర్యాలు లేని ఎల్లారెడ్డిలో వైద్య సేవలు విస్తరణ తన లక్ష్యమని చెప్పారు.
కరోనా ఆపద సమయంలో ప్రాణాలు తెగించి ప్రజలను కాపాడనని చెప్పారు. ఎల్లారెడ్డి గ్రామాలలో 95 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. కనీసం వైద్య సౌకర్యాలు లేక పక్షవాతం లాంటి అనేక సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ 40 శాతం కమిషన్ ఎమ్మెల్యే అని ఆరోపించారు.
జాజుల సురేందర్ డిపాజిట్ గల్లంతు చేయాలని కార్యకర్తలను కోరారు. ఎల్లారెడ్డిలో 18 సర్వేలు నిర్వహిస్తే అన్ని సర్వేలల్లో మదన్మోహన్రావుకు ఆదరణ లభించిందని అందుకే ఎమ్మెల్యే టికెట్ దొరికిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డిలో ఓటమి తద్యమని మదన్మోహన్ రావు చెప్పారు. కెసిఆర్ ప్రభావం ఎల్లారెడ్డి మీద ఉండదని కామారెడ్డిలోనే కేసీఆర్ ఓడిపోతున్నాడని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కలకుంట్ల మదన్మోహన్ చెప్పారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ ప్రజల కోసం ఒక్క ఇల్లు కట్టలేదని ప్రజలు చందాలు వేసుకుని గెలిపిస్తే కోట్ల రూపాయలకు అమ్ముడు పోయాడని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఆరోపించారు.
ప్రజలను ఒక్క రూపాయి ఆశించవద్దని కుటుంబ సభ్యుల షరతు
రాజకీయాలలో ఉంటే ప్రజల నుండి ఒక రూపాయి ఆశించవద్దని ప్రజలను డబ్బు అడగవద్దని ప్రజాసేవ చేయాలంటే రాజకీయంలో ఉండాలని వారిని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు షరతు విధించారని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ రావు కార్యకర్తల సమావేశంలో ఆవేదనతో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీ హామీలు ప్రజలలో అపూర్వ ఆదరణ చూపిస్తున్నాయని చెప్పారు. ఎల్లారెడ్డిలో కార్యకర్తలు సైనికుల పని చేయాలని రాబోయే 30 రోజులు నిద్రలేకుండా పనిచేస్తే ఐదేళ్లు సేవ చేసుకుంటానని హామీ ఇచ్చారు.
ప్రజలను కాపాడే ధైర్యం ప్రజలకు సేవ చేయాలనే శక్తి మొండితనం తన వద్ద ఉందన్నారు. తాను ప్రజల నుండి ఒక రూపాయి ఆశించినని ప్రజల ప్రేమ అభిమానం కావాలన్నారు. క్లస్టర్ల , మండలాల వారీగా మీటింగ్లు ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ ప్రచారం ముమ్మరం చేయాలన్నారు. ఎల్లారెడ్డిలో బిజెపికి లీడర్ లేడని టిఆర్‌ఎస్ అభ్యర్థి సురేందర్‌ను గ్రామ గ్రామాన నిలదీస్తున్నారని మదన్మోహన్ ఆరోపించారు. కొత్త వారిని తీసుకురండి కాంగ్రెస్ ప్రచారం ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రజల నుండి ఒక్క రూపాయి ఆశించవద్దని ప్రజలకు సేవ చేయాలని తన భార్య పిల్లలు తనకు షరతు విధించారని అమెరికా లో తనకు ఆస్తులు భూములు వ్యాపారాలు ఉన్నాయని ప్రజలకు సేవ చేయడానికి తాను ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నట్లు మదన్మోహన్ కార్యకర్తల సమావేశంలో గద్గద స్వరంతో పేర్కొన్నారు.
నవంబర్ 4న ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ తరపున నామినేషన్ వేస్తున్నట్లు మదన్ మోహన్ ప్రకటించారు.
క్లస్టర్ వారిగా మండలాల వారీగా మీటింగ్లు పెట్టుకుని ప్రచార నిమ్మమరం చేయాలని కార్యకర్తలకు చెప్పారు ఎల్లారెడ్డి కేంద్రంగా మూడు మండలాలు గాంధారి కేంద్రంగా నాలుగు మండలాల తో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయాలని ఆదేశించారు. రోజుకు 12 గ్రామాలలో గడప గడపకు కాంగ్రెస్ ప్రచారం ముమ్మరం చేయాలన్నారు. అత్యధికంగా ప్రతి బూత్ స్థాయి లో అధిక శాతం కాంగ్రెస్కు ఓట్లు పడేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ప్రతి వారిని కలవాలని పెద్ద మనుషులకు దండం పెట్టాలని చెప్పారు.
కార్యకర్తల చేత కాంగ్రెస్ పార్టీ ని గెలిపిస్తామని ప్రమాణం చేయించారు. గడపగడపకు ఆరు కాంగ్రెస్ గ్యారంటీలను తీసుకెళ్లాలని ఆరు కాంగ్రెస్ గ్యారంటీలతో ప్రజలలో అపూర్వ ఆదరణ లభిస్తుందని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ కార్యకర్తలకు దేశానిర్దేశం చేశారు.