Daily Archives: October 31, 2023

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ నిషేధం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించరాదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ప్రస్తుత ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించరాదని, అలాంటి వార్తలను ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రసారం చేయడం, ప్రింట్‌ మీడియాలో ప్రచురించడం గానీ చేయరాదన్నారు. 7 …

Read More »

భక్తి శ్రద్ధలతో హనుమాన్‌ చాలీసా పారాయణము

ఆర్మూర్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ జర్నలిస్ట్‌ కాలనీ శ్రీ భక్త హనుమాన్‌ ఆలయంలో ప్రతీ మంగళవారం మాదిరిగానే ఈ మంగళ వారం కూడా హనుమాన్‌ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కాలనీ వాసులు భక్తిశ్రద్ధలతో హనుమాన్‌ చాలీసా పారాయణము చేశారు. భక్త హనుమాన్‌ ఆలయ ప్రాంగణంలో భక్తులు నిలబడి సామూహికంగా హనుమాన్‌ చాలీసా పారాయణము చేశారు. అనంతరం మంగళ హారతి ఇచ్చారు, జై శ్రీరామ్‌, …

Read More »

ఎస్సారెస్పీ రివర్స్‌ పంపింగ్‌ను పరిశీలించిన రైతు సంఘాల నాయకులు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్‌ పంప్‌ హౌజ్‌ను మంగళవారం అఖిల భారత రైతు సంఘాల నేతలు సందర్శించారు. కాళేశ్వరం జలాల 300 కిలో మీటర్ల నుండి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ఎదురెక్కించి ఎస్సారెస్పీలో నింపే ప్రక్రియను రైతు నాయకుడు కోటపాటి నర్సింహ నాయుడు వారికి వివరించారు. సీఎం కేసిఆర్‌ వల్లే ఇది …

Read More »

రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మాల్యాద్రి రెడ్డి

బాన్సువాడ, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాల్యాద్రి రెడ్డి మంగళవారం హైదరాబాదులోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నివాసంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరగా వారికి రేవంత్‌ రెడ్డి మల్యాద్రి రెడ్డికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాల్యాద్రి రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో బారస అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని ఎన్నికల్లో ఓడగొట్టడమే …

Read More »

ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయం సమీపంలోని ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ తో కలిసి కౌంటింగ్‌ గదులను పరిశీలించి వాటిని వెంటనే శుభ్రపరచి పెయింటింగ్‌తో రెండు రోజులల్లో సిద్ధం చేయవలసినదిగా సూచించారు. జుక్కల్‌, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గాలకు …

Read More »

ధాన్యం రవాణాకు అవసరమైన లారీలు అందుబాటులో ఉంచాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పౌరసరఫరాల సమస్త ఆధ్వర్యంలో నాణ్యమైన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా అధికారులు రైతుల నుంచి కొనుగోలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం అధికారులు, రైస్‌ మిల్‌ యజమానులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో 2,92,105 …

Read More »

పోలింగ్‌ విధులపై పూర్తి అవగాహన ఏర్పరుచుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత శాసన సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30 న చేపట్టనున్న పోలింగ్‌ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, శిక్షణ తరగతుల్లో మాస్టర్‌ ట్రైనర్లచే నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. ప్రిసైడిరగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడిరగ్‌ అధికారులకు నిజామాబాద్‌ జిల్లా …

Read More »

ప్రజల చందాలతో గెలిచి పత్తా లేకుండా పోయారు…

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల చందాలతో గెలిచి వారికి అందుబాటులో లేకుండా పత్తా లేకుండా పోయిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్‌ను తరిమి కొట్టాలని గ్రామాలలో నిలదీయాలని ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి కలకుంట్ల మదన్‌ మోహన్‌ రావు కార్యకర్తలకు చెప్పారు. మండల కేంద్రంలో గడపగడప కాంగ్రెస్‌ ప్రచారం చేపట్టి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కొత్తగా కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి …

Read More »

కలెక్టరేట్‌లో రాష్ట్రీయ ఏక్తా దివస్‌ ప్రతిజ్ఞ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రీయ ఏక్తా దివస్‌ను పురస్కరించుకుని మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌)లో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా పాలనాధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు కలెక్టరేట్‌ అధికారులు, సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడడానికి అంకితభావంతో కృషి చేస్తానని, తోటి వారందరిలో ఈ భావనను పెంపొందించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ దార్శనికతతో దేశానికి …

Read More »

కామారెడ్డిలో బిఆర్‌ఎస్‌కు భారీ షాక్‌…

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీఆర్‌ఎస్‌ పార్టీకి కామారెడ్డిలో భారీ షాక్‌ తగిలింది. కామారెడ్డి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గడ్డం ఇందు ప్రియా రాజీనామ చేశారు. రాజీనామా లేఖను కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు ఎంకే ముజీబొద్దీన్‌కు అందజేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి 16వ వార్డు కౌన్సిలర్‌ చాట్ల వంశీ కూడా రాజీనామా చేశారు. బీఆర్‌ఎస్‌ పట్టణ ఉపాధ్యక్షులు కనపర్తి అరవింద్‌, బిసి సెల్‌ సెక్రటరీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »